Friday, March 29, 2024
- Advertisement -

‘చావు కబురు చల్లగా’ సినిమా రివ్యూ!

- Advertisement -

చిత్రం: చావు కబురు చల్లగా
రేటింగ్: 2.5/5
నటీనటులు: కార్తికేయ గుమ్మకొండ, లావణ్య త్రిపాఠి, ఆమని
దర్శకత్వం: కౌశిక్ పెగళ్లపాటి
నిర్మాతలు: బన్నీ వాసు
సమర్పణ: అల్లు అరవింద్
కెమెరా: కర్మ్ చావ్లా
ఎడిటింగ్: జి. సత్య
సంగీతం: జేక్స్ బిజోయ్
విడుదల తేదీ: 19 మార్చ్ 2021

‘ఆర్‌ఎక్స్‌100’ సినిమాతో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన యువకెరటం కార్తికేయ. ఆ ఒక్క సినిమాతో కార్తికేయ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు.  మొదటి నుంచి కార్తికేయ డిఫరెంట్ షేడ్స్ పాత్రలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. గ్యాంగ్ లీడర్ మూవీలో విలన్ గా కూడా నటించాడు. తాాజాగా చావు కబురు చల్లగా చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

కథ :
బస్తీ బాలరాజు (కార్తికేయ) శవాలను మోసుకెళ్లే వాహన డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. సిటీలో ఎవరైనా చనిపోతే తన వాహనంలో స్మశానానికి తీసుకెళ్లి, వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తుంటాడు. అతని తల్లి గంగమ్మ(ఆమని) మార్కెట్లో మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటుంది.  ఒక రోజు  భర్తను కొల్పోయిన యువతి మల్లిక(లావణ్య త్రిపాఠి)ని చూసి ప్రేమలో పడతాడు. అంత్యక్రియల సమయంలోనే మల్లికను పెళ్లి చేసుకుంటానని వారి బంధువుల ముందే చెప్తాడు. కానీ ఆమె ఆ ప్రపోజల్ కి నో చెబుతుంది. అయినప్పటికీ బాలరాజు మల్లిక వెంటపడుతూనే ఉంటాడు. కట్‌ చేస్తే.. టీవీలు రిపేరు చేసే మోహన్‌(శ్రీకాంత్‌ అయ్యంగార్‌)తో గంగమ్మ చనువుగా ఉండటం చూసి బాలరాజు బాధపడతాడు. మరోవైపు తన తల్లి గంగమ్మ వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. అయితే ఆమెకన్నా భర్తను కోల్పోయినా నిప్పులా బతుకుతున్న మల్లిక చాలా గొప్పదని భావిస్తాడు బాలరాజు. అసలు గంగమ్మ మరో వ్యక్తితో ఎందుకు చనువుగా ఉంది? భర్తను కోల్పోయిన మల్లిక ప్రేమను బస్తీ బాలరాజు ఎలా దక్కించుకున్నాడు? అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

చావు నుంచి తప్పించుకోలేమనేది జ‌గ‌మెరిగిన స‌త్యం. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు చావక తప్పదు. బంధాలు, బంధుత్వాలు రకరకాలుగా ఉంటాయి. ఎవరి జీవితానికి వారే నిర్ణేతలు. ఈ పాయింటు మీద దర్శకుడు కథైతే బాగానే రాసుకున్నాడు కానీ అవసరమైన ఎమోషన్ ని పండించడంలో విఫలమయ్యాడనలేం కానీ కస్త తడబడ్డాడని చెప్పొచ్చు. ముఖ్యంగా భర్తను కోల్పోయిన మహిళలు అయితే ఇక తమ జీవితం ఇంతే అనుకుంటూ అదే బాధలో ఉంటారు. కానీ అదే జీవితం కాదు.  కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలి. అప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు. తొలి చిత్రంతోనే ఓ కొత్త కాన్సెప్ట్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేశాడు. కానీ దర్శకుడు అనుకున్న కథను మాత్రం తెరపై చూపించడంలో విఫలమయ్యాడు.

నటీనటులు :

కార్తికేయ వెరైటీ క్యారెక్టర్లో బాగానే చేసాడు. ఆమని నటన ఎంతో బాగుంది.. అయితే కార్తికేయకు మాత్రం తల్లి పాత్రలో కాస్త సెట్ కాలేదనే చెప్పొచ్చు. గంగమ్మ పాత్రలో ఆమె నటించడం కంటే జీవించేశారని చెప్పొచ్చు. గంగమ్మ క్యారెక్టరైజేషన్ సినిమాకు చాలా ఫ్లస్‌ పాయింట్‌. బస్తీ బాలరాజు అనే ఊరమాస్‌ క్యారెక్టర్‌లో కార్తికేయ ఒదిగిపోయాడు.  సినిమా భారాన్ని తన భుజాల మీద వేసుకొని మెప్పించాడు. ఎమోషనల్ సీన్లలో కూడా అద్భుతంగా నటించాడు. భర్తను కోల్పోయిన అమ్మాయిగా లావణ్య త్రిపాఠి అద్భుతంగా నటించింది. మురళీ శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, భద్రం తదితరులు తమ పాత్ర పరిధిమేరకు నటించారు.

సాంకేతికవర్గం :

సినిమా కథలో బలమున్నా..స్క్రీన్‌ప్లేను శక్తివంతంగా రాసుకోలేకపోయాడు. స్ర్కీన్‌ప్లే రొటీన్‌గా సాగుతుంది. టెక్నికల్ గా చెప్పాలంటే ఈ సినిమాలో బాగున్న అంశాల్లో మొదటిది పాటల్లోని సాహిత్యం. దాదాపు ప్రతి పాటలోనూ ఎంటెర్టైనింగ్ గా వేదాంతం చెప్పడం బాగుంది. బాలరాజు మల్లిక వెనుకపడే సన్నివేశాలు కూడా నత్తనడకగా, రొటీన్‌గా అనిపిస్తాయి. ఇక సెకండాఫ్‌ మాత్రం పర్వాలేదనిపిస్తుంది. కెమెరా వర్క్, ఎడిటింగ్ కూడా పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. జోక్స్, బిజోయ్ సంగీతం బాగుంది.

ప్లస్‌ పాయింట్స్‌: కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని నటన

మైనస్‌ పాయింట్స్ : స్క్రీన్‌ ప్లే, ఫస్టాఫ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -