Saturday, May 18, 2024
- Advertisement -

బాబుకు బిగ్గెస్ట్ షాక్…….. వైకాపాలోకి గుంటూరు టిడిపి ఎమ్మెల్యే

- Advertisement -

2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టిడిపికి ఉపయోగపడిన నాయకుడు………. సీమాంధ్ర కోసం మేం ఫైట్ చేశాం అని సీమాంధ్ర ప్రజలకు మొహం చూపించుకోవడానికి చంద్రబాబు వాడుకున్న నాయకుడు ఇప్పుడు చంద్రబాబుకు బిగ్గెస్ట్ షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. 2014 ఎన్నికలు, అంతకు ముందు నుంచీ కూడా ప్రతీ సందర్భంలోనూ ఆ నాయకుడిని వాడుకోవడమే తప్ప ఆ నాయకుడిని చంద్రబాబు గుర్తించి ఎప్పుడూ లేదు. ఆయనే టిడిపి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో సమైక్యాంధ్ర కోసం ఫైట్ చేస్తూ నాడు ఎంపిగా ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్లమెంట్‌లో స్పృహ తప్పి పడిపోయాడు. తెలంగాణాకు మద్దతుగా లేఖలు ఇచ్చి, దేశవ్యాప్తంగా చాలా మందిని నాయకులను కలిసి డిమాండ్ చేసి, తెలంగాణా ఇస్తారా లేదా అని సోనియాను కూడా డిమాండ్ చేసిన చంద్రబాబుకు సమైక్యాంధ్ర కోసం టిడిపి కూడా కష్టపడింది అని చెప్పుకోవడానికి ఉపయోగపడిన నాయకుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. రాష్ట్ర విభజన బిల్లుకు మొదటి మద్దతు ఓటు వేసింది టిడిపి నాయకుడే. అయినప్పటికీ సమైక్యాంధ్ర కోసం ఫైట్ చేస్తూ స్పృహ తప్పిపడిపోయిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని చూపించి చాలానే ప్రచారం చేసుకుని లాభపడ్డారు బాబు ఆయన భజన మీడియా జనాలు.

ఇప్పుడు ఈ నాయకుడు చంద్రబాబు వాడకాన్ని ఇక భరించలేనని చెప్తున్నాడు. జేసీలతో సహా టిడిపిలో రెడ్డి కులస్థులను దారుణంగా అవమానిస్తున్నారని, అధికారంలోకి రావడానికి వాడుకుని ఆ తర్వాత కనీస స్థాయిలో కూడా విలువ ఇవ్వడంలేదని వాపోతున్నాడు. ప్రముఖ పారిశ్రామిక వేత్త అయోధ్య రామిరెడ్డికి బంధువైన ఈ నాయకుడు ఇప్పుడు జగన్ సమక్షంలో వైకాపాలో చేరడానికి రెడీ అయ్యాడు. అయోధ్య రామిరెడ్డి తరపున కూడా 2019 ఎన్నికల్లో జగన్‌కి పూర్తి మద్దతు ఉండేలా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ప్రజలను, నాయకులను అందరినీ వాడుకుని వదిలేసే రకమైన చంద్రబాబు మరోసారి అధికరాంలోకి వస్తే రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలవుతుందని తన అనుచరులతో వ్యాఖ్యానించాడు ఈ నాయకుడు. అతి త్వరలోనే జగన్ సమక్షంలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైకాపాలో చేరనున్నాడు. గుంటూరు జిల్లాలో అత్యధిక ఎమ్మెల్యే సీట్లలో వైకాపా గెలిచేలా కష్టపడతానని జగన్‌కి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే స్థాయి నాయకుడు ప్రతిపక్ష పార్టీలో చేరడం మాత్రం చంద్రబాబుకు బిగ్గెస్ట్ షాక్ అనడంలో సందేహం లేదు. ప్రజల్లో కూడా 2019 ఎన్నికల్లో టిడిపి గెలుపుపై సందేహాలు రేకెత్తించే స్థాయి పరిణామంగా ఈ చేరికను చూడొచ్చని విశ్లేషకులు చెప్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -