Wednesday, May 15, 2024
- Advertisement -

జగన్ జన ప్రభంజనం…. నిమిషాలపాటు దుర్గమ్మ వారధిపై ప్రకంపనలు

- Advertisement -

వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర విజయవాడకు చేరుకున్న నేపథ్యంలో జగన్ వెంట నడిచిన జన ప్రభంజనం ప్రవాహానికి కొన్ని నిమిషాల పాటు దుర్గమ్మవారథి ప్రకంపించింది. వైఎస్ జగన్ సెక్యూరిటీ కూడా భయపడ్డారు. జగన్ చుట్టూ వారధిలా నిలబడ్డారు. వెంటనే పాదయాత్ర నిర్వాహకులు ప్రజల కదలికలను నియంత్రించారు. ఎక్కడవాళ్ళు అక్కడే నిలబడాలని ..అలా నిలబడితేనే దుర్గమ్మ వారధి ప్రకంపనలు తగ్గుతాయని ప్రజలను కోరారు. ఆ తర్వాత కొంత సేపటికి ప్రకంపనలు తగ్గాక పాదయాత్ర ముందుకు సాగింది. అందరూ చూస్తుండగానే జరిగిన ఈ ఒక్క సంఘటన చాలు…..కృష్ణా జిల్లాలో జగన్ జన ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి. ఇప్పుడు ఇవే ప్రకంపనలు చంద్రబాబుతో సహా టిడిపి నేతల గుండెల్లో కూడా వస్తున్నాయి. దశాబ్ధాలుగా ఎంతో మంది నేతలు ధర్నాలు, ఆందోళనలు, పాదయాత్రలు చేసినప్పుడు కూడా ఈ స్థాయిలో జన ప్రవాహం రాలేదని …దుర్గమ్మవారధి కూడా ప్రకంపించే స్థాయిలో జన సునామీ జగన్ వెంట నడవడం టిడిపికి ప్రమాద హెచ్చరికనేనని టిడిపి నేతలు కూడా అభి్ప్రాయపడుతున్నారు.

శ్రీకృష్ణ కమిటీతో సహా ఢిల్లీ స్థాయి నివేదికలు ఎన్నో అమరావతి ప్రాంతంలో రాజధాని సరైన నిర్ణయం కాదని చెప్పినప్పటికీ గుంటూరు-కృష్ణా జిల్లాల్లో వర్గ ప్రజలు అండగా నిలబడతారన్న ఉద్ధేశ్యంతో ఏకపక్షంగా అమరావతిని రాజధానిగా చేశాడు చంద్రబాబు. అయితే ఇప్పుడు అదే అమరావతి ప్రాంతంలో జగన్ జన ప్రభంజనాన్ని చూసి టిడిపి నేతలే షాక్ తింటున్నారు. 2019 ఎన్నికల్లో గుంటూరు-కృష్ణా జిల్లాల్లో టిడిపి స్వీప్ ఖాయమని భావిస్తూ ఉంటే ఈ ప్రమాద హెచ్చరికలు ఏంటని టిడిపి నేతలు వాపోతున్నారు. బలవంతపు భూ సేకరణలు, సంవత్సరాల పాటు 144 సెక్షన్ విధించి ప్రజలను హింసించడంలాంటివి ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించి ఉన్నాయని…..అవన్నీ కూడా ఇప్పుడు జగన్ ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా ప్రజల ఆగ్రహం రూపంలో బయటపడుతున్నాయని టిడిపి నేతలు విశ్లేషిస్తున్నారు. ఇంకొక్క ఏడాది సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో గుంటూరు-కృష్ణా జిల్లా ప్రజలను మెప్పించడానికి చంద్రబాబు తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉంటాయో చూడాలని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. గుంటూరు-కృష్ణా జిల్లాల్లో కూడా చంద్రబాబు వ్యతిరేక ఓట్లది పై చేయి అయితే మాత్రం 2019 ఎన్నికల ఫలితాలు చరిత్రలో ఎన్నడూ లేనంత ఏకపక్షంగా ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -