Friday, May 17, 2024
- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక‌కు దూరంగా భాజాపా…

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నికలో గెల‌వ‌డానికి అధికార పార్టీ టీడీపీ చేయ‌ని జిమ్మిక్కులు లేవు. ఎన్నిక నోటిఫికేష‌న్ రాకుండానె బాబు,లోకేష్ విస్త్రుతంగా ప్ర‌చారం చేస్తున్నారు. టీడీపీకి ధీటుగా ప్రతిపక్షం వైఎస్సార్సీపీ కూడా ‘షో’ మొదలు పెట్టింది. ఇంత వ‌ర‌కు బాగానె ఉంది.కాని టీడీపీ మిత్ర ప‌క్షం భాజాపానె ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.
నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి టీడీపీ మిత్రపక్షం బీజేపీ పాత్ర ఎలా వుండబోతుంద‌నేది ఇప్పుడు కీలకంగా మారింది. కర్నూలు జిల్లాలో బీజేపీకి పెద్దగా పట్టు లేని మాట వాస్తవం. అయితే, ఎన్నికల ప్రచారంలో మిత్రపక్షం బీజేపీ కలిసొస్తే అదో ‘ఊరట’ కింద టీడీపీ భావించడమూ సహజమే. కానీ, బీజేపీ మాత్రం నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి టీడీపీకి దూరంగా వుండాలనుకుంటోందట. అదే నిజమైతే, ఇది టీడీపీకి పెద్ద షాకే.
పార్టీ ఫిరాయింపులకు మేం వ్యతిరేకం..’ అని తేల్చేసిన అప్పటి కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు, ‘పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమే అయినా.. అవి ఆంధ్రప్రదేశ్‌లోనే కొత్తగా మొదలవలేదు కదా..’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. అయితే ఇప్పుడు వెంకయ్య, ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌ బై చెప్పేశారు.
చంద్రబాబుకి ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద దిక్కు లేకుండా పోయింద‌నే చెప్పుకోవ‌లి.ప్ర‌తీ దానికి వెంక‌య్య స‌పోర్ట్‌గా ఉన్నార‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.ఇప్ప‌టి వ‌ర‌కు భాజాపాను ప్ర‌చారానికి మిత్ర‌ప‌క్షం పిలువ‌లేదు.పిలిచినా పార్టీ ఖండువా లేకుండా రావాల‌ని శ‌ర‌తు విధించింది.2019 ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇక బాబుకు చుక్క‌లు క‌నిపించ‌డం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -