Tuesday, May 21, 2024
- Advertisement -

ఆత్మ ర‌క్ష‌ణ‌లో చంద్ర‌బాబు…

- Advertisement -

ఎన్నిక‌లు ముంచుకొస్తున్న వేల ఏపీ సీఎం చంద్ర‌బాబుకి బ్యాడ్‌టైమ్ స్టార్ట్ అయ్యింది. వెంక‌య్య కేంద్రంలో మంత్రిగా ఉన్న‌నాల్లు సాగిన బాబు ఆట‌లు ప్ర‌స్తుతం సాగ‌డంలేదు. ప్ర‌స్తుతం పోవ‌ల‌రం ఇష్యూ పెద్ద‌ది కావ‌డంతో దానినుంచి బ‌య‌ట‌ప‌డేందుకు బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌వుతున్నాయి. ఏడాదిన్న‌ర్ర‌గా బాబుకు మోదీ అపాయంట్‌మెంట్ దొర‌క‌డంలేద‌న్న సంగ‌తితెల‌సిందే. తాజాగా కేంద్రం ద‌గ్గ‌ర బాబుకు మ‌రోసారి చుక్కెదురయ్యింది. మోదీ కాదు క‌దా క‌నీసం ముఖ్య‌మైన నేత‌ల అపాయంట్‌మెంట్ కూడా దొర‌క‌డంలేదు.

బాబుని కేంద్రం పూర్తిగా దూరం పెట్టింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. పోలవరం పనుల జాప్యంలో తమను దోషిగా నిలబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని గ్రహించిన కేంద్రంలోని పెద్దలు చంద్రబాబును కలవటానికి ఇష్టపడలేదని ప్రచారం జరుగుతోంది. పోలవరం పనులకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం ఇటీవలే ఓ టెండర్ నోటిఫికేష్ ఇచ్చింది. అంతర్జాతీయ టెండర్లకు 45 రోజులు గడువు ఇవ్వాల్సుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం 18 రోజులే గడువిచ్చింది.ఆ నోటిఫికేషన్లో తప్పులున్నాయంటూ నోటిఫికేషన్ ప్రక్రియను నిలిపేయమని కేంద్రం ఆదేశించింది.

దిక్కుతోచ‌ని బాబు కేంద్ర‌మే పోల‌వ‌రాన్ని అడ్డుకుంటోంద‌ని ఎదురుదాడికి దిగారు. జరుగుతున్న పరిణామాలను తెలుసుకున్న కేంద్రం తానిచ్చిన ఆదేశాల కాపీలను రాష్ట్ర నేతలకు పంపించింది. అది చూసిన భాజపా నేతలు చంద్రబాబుపై ఎదరుదాడి చేయటంతో మొత్తం వ్యవహరమంతా బయటకు వచ్చింది. అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాల‌నుంచి కూడా విమ‌ర్శ‌లు మొద‌ల‌వ్వ‌డంతో ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డ బాబు పోవ‌ల‌రం స‌మ‌స్య‌ను ప‌రిస్క‌రించుకొనేందుకు కేంద్ర‌పెద్ద‌ల‌ను క‌లుస్తాన‌ని చెప్పారు.

అందులో భాగంగానే సోమవారం తెల్లవారుజామును ధక్షిణ కొరియాకు బయలుదేరిన చంద్రబాబు అంతుకుముందు ప్రధానితో పాటు కేంద్రమంత్రులను కలిసేందుకు చాలా ప్రయత్నాలే చేశారు. చివ‌రికి చుక్కెదురవ‌డంతో ద‌క్ష‌ణ‌కొరియాకు బ‌య‌లు దేరారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మొదలైన ఈ పరిణామాలు చివరకు ఎటు దారి తీస్తాయో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -