Sunday, May 19, 2024
- Advertisement -

మామిడిపండ్లు తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయా?

- Advertisement -

వేసవిలో మాత్రమే లభించే పండ్లలో ఒకటి మామిడి. పండ్లలో రారాజుగా పిలిచే ఈ పండును తినని వారుండరూ.మామిడిపండులో ఫోలెట్ యాసిడ్, బీటా కెరోటిన్, జింక్, కాల్షియం.. ఇలా చాలా రకాల పోషకాలు సమృద్దిగా లభిస్తాయి. మామిడి పండు తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. మామిడిలో ఉండే ఫైబర్ కారణంగా మలబద్దకం సమస్య తగ్గిపోతుంది.

అయితే కొంతమంది మామిడి పండ్లు తింటే బాడీలో షుగర్‌లెవల్స్‌, బరువు పెరుగుతారని అపోహ ఉంది. మామిడి పండు తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకునే వారికి మామిడిపండ్లు మంచివని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చర్మ సమస్యలను నివారిస్తుంది. కంటి ఆరోగ్యానికి మామిడి ఎంతో ప్రయోజనకరం. అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికి మామిడి పండును సరైన పద్దతిలో తినకపోతే నష్టాలు తప్పవని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -