Sunday, May 19, 2024
- Advertisement -

కన్నాకు క్లారిటీ ఉందా..?

- Advertisement -

పార్టీ మారడం ఒకే. కానీ పార్టీలో ఇమడటం సంగతేంటి.. అవకాశమొస్తే ఒకే.. కానీ అవకాశ వాదమని పక్కనపెట్టేస్తే పరిస్థితి ఏంటీ.. కమళం నుంచి పెట్టే బేడ సర్ధేసుకొని పోయాడు సరే.. కానీ టీడీపీలో సర్థుకు పోగలడా.. దశాబ్ధాల పాటు బహిరంగంగా చంద్రబాబును కడిగేసిన కన్నా.. ఇప్పుడు అదే బాబుతో కలిసి అడుగులేయగలడా

కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు. కోట్ల విజయ భాస్కర్‌ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, వెదురుమళ్లి జనార్థన్‌ రెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, కిరణ్‌ కుమార్‌ రెడ్డి కాబినెట్‌లో ఈయనది బ్రహ్మాస్త్రం. వీరి సారథ్యంలో కన్నాకు సుదీర్ఘ కాలంగా మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సందించే అస్త్రాలకు కాంగ్రెస్ పక్షాన కాచుకొని నిలబడి ఎదురు దాడి చేసిన లీడర్‌. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నా, ప్రతిపక్ష నేతగా ఉన్నా కన్నా కంగ్రెస్ తరపున అస్త్ర శస్త్రాలు సందించాడు. అలాంటి నేత ప్రస్తుతం తాను ఎదురు దాడి చేసిన చంద్రబాబు క్రిందకు వెళ్లాడు. ఇదంతా విచిత్రంగా ఉంది కదూ.. రాజకీయం అంటే అంతే మరి. రాజకీయాల్లో శాస్వత సెత్రువులు శాస్వత మిత్రువులు ఉండరని మరోసారి రుజువైంది.

ఐతే మాస్‌ ఇమేజ్‌ ఉన్న కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో సర్థుకు పోగలడా.. ఆయన స్థాయికి తగిన గౌరవం టీడీపీ నాయకత్వం ఇస్తుందా.. ప్రధానంగా కాపు నేతలున్న పార్టీలో, అదే కులంలో మంచి ఇమేజ్‌ ఉన్న కన్నా రాకను కాపు నేతలు జీర్ణించుకుంటారా.. గుంటూరు జిల్లాలో పాతకు పోయి మంత్రి పదవుల కోసం ఎదరుచూస్తున్న పార్టీ సీనియర్‌ నేతలు కన్నా రాకను మనస్పూర్తిగా ఆహ్వానించి ఆయనతో కలిసి మనస్పూర్తిగా పని చేస్తారా అనేది ఇప్పుడు చర్చనీయంశమైంది. బహునాయకత్వం ఉన్న కాంగ్రెస్‌ మరో జాతీయ పార్టీ అయిన బీజేపీలో పని చేసిన కన్నాలక్ష్మీనారాయణ ఏక నాయకత్వం ఉన్న టీడీపీలో ఇమడగలరా అనేది అందరినీ ఆసక్తికి గురిచేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -