Thursday, May 16, 2024
- Advertisement -

2014 ఎన్నికల్లో జ‌గ‌న్ అందుకే ఓడిపోయాడు – కేసీఆర్‌

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ,ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్‌ల మ‌ధ్య స‌త్స‌సంబంధాలు ఉన్న సంగ‌తి తెలిసిందే.2014 ఎలెక్ష‌న్ల స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్‌,తెలంగాణ‌లో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంద‌ని చెప్పి పెద్ద సంచ‌ల‌నానికి తెర లేపారు.తీరా చూస్తే తెలంగాన‌లో కేసీఆర్ గెలిచారు కాని ఆంధ్రప్ర‌దేశ్‌లో మాత్రం జ‌గ‌న్ ఓడిపోయారు.అయితే కేసీఆర్ తెలంగాణ‌లో ముంద‌స్తు ఎలెక్ష‌న్స్‌కు వెళ్తున్నా సంగ‌తి తెలిసిందే.ఈ త‌రుణంలో ఆయ‌న వైఎస్ జ‌గ‌న్ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన వాఖ్య‌లు చేశారు.2014 జ‌రిగిన ఎన్నిక‌ల‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్‌.జ‌గ‌న్ ఎందుకు ఓడిపోయారో వివ‌రించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ .రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తలపడనున్న టీఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశమైన ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

2014 ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లడం ద్వారా గెలిచారని.. జగన్ అతి విశ్వాసంతో ఓటమి పాలయ్యారని కేసీఆర్ అన్నారు.నాడు చంద్రబాబు అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు తెలంగాణలోనూ అమలు చేసి విజయం సాధించాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.జగన్‌లా అతి విశ్వాసం ప్రదర్శించవద్దని, నిర్లక్ష్యాన్ని వీడి ముందుకు సాగాలని అభ్యర్థులను కేసీఆర్ హెచ్చరించారు. టీడీపీ హయాంలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరినీ పార్టీ నేతలు కలిశారని, తొలి గంటలోనే వారిని పోలింగ్ బూత్ కు తీసుకురావడంలో సఫలం అయ్యారని పేర్కొన్నారు.ఇప్పుడు అదే వ్యూహాన్ని మీరూ అనుసరించాలంటూ అభ్యర్థులకు సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -