Saturday, May 18, 2024
- Advertisement -

అందుకు ఈ వ్యాఖ్య‌లే నిద‌ర్శ‌నం…

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో అఖిల ప్రియ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.నిన్న‌టి వ‌ర‌కు టీడీపీ గెల‌పుపై దీమాగా ఉన్న మంత్రి ఇప్పుడ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్నాయి.ప‌లు ఆంశాల‌పై స్పందించారు.ఉప ఎన్నిక‌ల్లో చెల్లెలు మైనిక పోటీచేయాల‌ని ప్ర‌య‌త్నించామ‌న్నారు.చివరకు భూమా బ్రహ్మానందరెడ్డి వస్తేనే బాగుంటుందన్న ఉద్దేశంతో చెల్లి నాగమౌళికకు కుటుంబబాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు.

ఉప ఎన్నిక‌కు భ‌య‌ప‌డ‌టం లేద‌ని చెబుతూనె …ఫలితం అటుఇటూ అయినా టీడీపీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని చెప్పారు. ఒక వేళ వైసీపీ గెలిచినా జగన్‌ ఇప్పటికిప్పుడు సీఎం అయిపోరు కదా అని ఆమె ప్రశ్నించారు. ఉప ఎన్నికల తర్వాత కూడా తామే రూలింగ్‌లో ఉంటామన్నారు.

ప్రచార బాధ్యతల నుంచి తనను సీఎం తప్పించారనడంలో నిజం లేదన్నారు. ఎన్నికలు ఎదుర్కొనే అనుభవం లేదు కాబట్టి సీనియర్లను పంపాల్సిందిగా తానే ముఖ్యమంత్రిని కోరారని అఖిలప్రియ చెప్పారు. మొత్తం మీద ఉప ఎన్నికల్లో గెలుపు తమదేనని మొన్నటి వరకు ధీమా వ్యక్తంచేస్తూ వచ్చిన భూమా అఖిలప్రియ… ఇప్పుడు మాత్రం ఫలితం అటుఇటు అయినా తమకు నష్టమేమీ లేదని చెప్పడం ఆసక్తిగా ఉంది.

నిన్న‌టి వ‌ర‌కు గెలుపు త‌మ‌దే న‌ని వ్యాఖ్యానించిన అఖిల ప్రియ ఇప్పుఉడ ఇలా మాట్లాడ‌టం ఆశ్చ‌ర్యంగాఉంది.శిల్పాకున్న ఆద‌ర‌న చూసి ముందే ఓట‌మిని అంగీక‌రించారా అన్న వార్త‌లు వినిపిస్తున్నాయి.గెలుపుపై ధీమా తగ్గడం వల్లే ముందు జాగ్రత్తగా భూమా అఖిలప్రియ ఈ తరహాలో వ్యాఖ్యలు చేశారా? అన్న అనుమానం వ్యక్తమవుతోంది.

https://www.youtube.com/watch?v=pzXC0MfaL94

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -