గురువులకు గౌరవం.. సాయం ఎప్పుడంటే..!

- Advertisement -

ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి సాయంపై మంత్రుల సమీక్ష నిర్వహించారు. దృశ్యమాధ్యమం ద్వారా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్.. కలెక్టర్లు, డీఈవోలు, పౌరసరఫరాల శాఖ డీఎస్‌లతో సమీక్షించారు.

ప్రైవేట్ టీచర్లకు చేసే సాయంపై విధివిధానాలు, కార్యాచరణపై చర్చ సాగింది. రూ.2 వేల సాయం, 25 కిలోల బియ్యం పంపిణీపై మంత్రులు చర్చించారు. ఏప్రిల్ నుంచే ప్రైవేటు టీచర్లకు సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెలకు రూ. 42కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది.

- Advertisement -

కార్యాచరణను పౌరసరఫరాల శాఖ సిద్ధం చేసింది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో 1.45 లక్షల మంది పనిచేస్తున్నారని అధికారులు అంచనా వేశారు. రేషన్‌ దుకాణాల వారీగా లబ్ధిదారులను గుర్తించాలని నిర్ణయించారు. ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

క్రేజీ కాంభో.. చరణ్ మూవీలో సల్మాన్ !

ఈ బ్యూటీకి కరోనా భయం ఇంకా పోలేదా?

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదుల హతం

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -