రెండో శతాబ్దం నాటి గణేశుని విగ్రహం

- Advertisement -

ఏపీలో రెండో శతాబ్దం నాటి గణపతి విగ్రహం లభ్యమైంది. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో శాతవాహనుల కాలం నాటి విఘ్నేశ్వరుడి ప్రతిమ బయటపడింది. జిల్లాలోని మడకశిర మండలం, నీలకంఠాపురంలో తవ్వకాలు జరుగుతుండగా విగ్రహం వెలుగులోకి వచ్చింది.

పొట్ట, ఎడమవైపు తిరిగినట్టుగా ఉన్న తొండం, పగిలిన కాళ్లు, చేతులు, చెవులు విగ్రహానికి ఉన్నాయని వెల్లడించారు. ఎరుపు, నలుపు మట్టిపాత్రల శకలాలతో ఈ విగ్రహం కనిపించింది. కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి నేతృత్వంలో వ్యవసాయ భూముల్లో గత కొంతకాలంగా అన్వేషణ జరుగుతుండగా, ఈ విగ్రహం కనిపించిందని అధికారులు తెలిపారు.

- Advertisement -

అయితే ఇది క్రీస్తు శకం, రెండో శతాబ్దానిదని గుర్తించామన్నారు. ఈ విగ్రహాన్ని ఆలయం వద్ద ఏర్పాటు చేయనున్న మ్యూజియంలో ఉంచుతామని మాజీ మంత్రి రఘువీరారెడ్డి వెల్లడించారు.

గురువులకు గౌరవం.. సాయం ఎప్పుడంటే..!

వారికి మాత్రం వంద శాతం.. ఎందుకంటే..?

క్రేజీ కాంభో.. చరణ్ మూవీలో సల్మాన్ !

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -