క్రేజీ కాంభో.. చరణ్ మూవీలో సల్మాన్ !

- Advertisement -

వెండితెర‌పై త‌నదైన న‌ట‌న‌తో మ‌స్తు క్రేజ్ సంపాందించుకున్న న‌టుడు రామ్ చ‌ర‌ణ్‌. త‌న సినిమాల‌తో దేశ‌విదేశాల్లోనూ గుర్తింపు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు శంక‌ర్‌. వీరిద్ధ‌రి కాంభినేష‌న్‌లో త్వ‌ర‌లోనే సినిమా రాబోతున్న‌ద‌నే వార్త‌లు సినీ వ‌ర్గాల‌తో పాటు ప్రేక్ష‌కుల‌లోనూ ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తున్న రామ్ చ‌ర‌ణ్‌.. ఈ సినిమా పూర్తయిన వెంట‌నే శంక‌ర్ సినిమాను ప‌ట్టాలెక్కించ‌డానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నార‌ట‌.

కాగా, రామ్ చరణ్-శంకర్‌ల క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న భారీ చిత్రాన్ని టాలీవుడ్ మోస్ట్ స‌క్సెస్ ఫుల్ అగ్ర‌ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌బోతున్నార‌ని స‌మాచారం. పాన్ ఇండియా లెవ‌ల్లో దాదాపు 200 కోట్ల రూపాయ‌ల‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న బాలీవుడ్ హాట్ బ్యూటీ కియార అద్వానీతో పాటు ఓ కొరియ‌న్ భామ కూడా ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం.

- Advertisement -

అయితే, ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ టాక్ సినీ వ‌ర్గాల్లో న‌డుస్తోంది. రామ్ చ‌ర‌ణ్‌-శంక‌ర్ కాంభోలో వ‌స్తున్న ఈ చిత్రంలో ఓ కీల‌క‌మైన అతిథి పాత్ర ఉంద‌నీ, ఆ పాత్ర‌ను బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ చేయ‌బోతున్నార‌నే క్రేజీ టాక్ వినిపిస్తోంది. మెగా ఫ్యామిలీ- స‌ల్మాన్ మ‌ధ్య మంచి స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబ‌ట్టి స‌ల్మాన్ ఈ చిత్రంలో న‌టించే అవ‌కాశం అధికంగానే ఉంది. చూడాలి చిత్ర యూనిట్ ఎప్పుడు అధికారికంగా ప్ర‌క‌టించ‌నుందో..!

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదుల హతం

వ్యాక్సినేషన్ ముమ్మరం చేయండి: సీఎం జగన్

ప‌వ‌న్ ‘వ‌కీల్ సాబ్’ గురించి… ఆలియా భట్ ఏమందో తెలుసా?

లక్కిఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ !

నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’కి బ్రేకులేసిన కరోనా

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -