Thursday, May 16, 2024
- Advertisement -

నంద్యాలపై ఆదినారాయణరెడ్డి పెత్త‌నం…. జీర్నించుకోలేని అఖిల వ‌ర్గం.. ప‌ద‌వి ఎవ‌రికి ద‌క్కుతుంది…?

- Advertisement -

ఒక్క ఉప ఎన్నిక గెలుపు కోసం ముందు వెనుకా ఆలోచించ‌కుండా అవ‌స‌రం కొద్ది హామీలు ఇచ్చుకుంటూ వెళ్లిన చంద్ర‌బాబుకు దాని సెగ త‌గులుతోంది. గెలుపు కోసం అడ్డ‌దారులు తొక్కిన బాబుకు ఇప్పుడు అదే కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎన్నిక సంయంలో అడిగిని వారంద‌రికి మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ ప‌ద‌వి ఇస్తాన‌ని ఆశ చూప‌డంతో ఆశావ‌హులంతా పార్టీ జుట్టు పీకుతున్నారు. మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ ప‌ద‌వి ఇష‌యంలో ఇద్దు మంత్రుల మ‌ధ్య‌ ఆధిప‌త్య పోరు తారాస్థాయికి చేరింది.

మార్కెట్ ఛైర్మెన్ యార్డు ప‌ద‌వి త‌మ వారికే ద‌క్కాల‌ని మంత్రులు ఆదినారాయ‌ణ‌రెడ్డి, అఖిల మ‌ధ్య విబేధాలు బ‌హిర్గ‌త మ‌య్యాయి. నంద్యాల మార్కెట్‌ యార్డు చైర్మన్‌గా శిల్పామోహన్‌రెడ్డి అనుచరుడు సిద్ధం శివరాం ఏడాదిన్నరపాటు కొనసాగారు. దివంగత ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి టీడీపీలో చేరాక సిద్ధం శివరాం పదవీ కాలాన్ని పొడిగించకుండా అడ్డుకొని తన వర్గీయులకు ఇప్పించుకోవాలని సిఫార్సు లేఖలు ఇచ్చారు. ఏడాది కాలంగా మార్కెట్ యార్డు చైర్మన్ ఆ పదవి ఖాళీగానే ఉంది.

పదవి ఆశ చూపి నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ నాయకులు ఓట్లు వేయించుకున్నారు. ఎన్నికలు ముగి..టీడీపీ అభ్యర్థి గెలవడంతో పదవి విషయంలో విభేదాలు తలెత్తాయి. ఎవరికి వారే పదవి తమకు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. శీలం భాస్కర రెడ్డి, మునగాల లక్ష్మీకాంతరెడ్డిలకు చైర్మన్ పదవిపై భూమా గతంలో హామి ఇచ్చారు. తండ్రి ఇచ్చిన హామి మేరకు మంత్రి అఖిలప్రియ వారికే పదవి దక్కాలని పోరాడుతున్నారు.

మరోవైపు ఆది నారాయణ రెడ్డి సైతం.. తన అనుచరులైన కానాల గురునాథ్ రెడ్డి, సాయినాథ్ రెడ్డిలకు చైర్మన్ పదవి ఇప్పిస్తానని హామి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఫరూక్‌.. తమ వర్గానికి చెందిన శ్రీశైలం దేవస్థానం మాజీ చైర్మన్‌ యాతం జయచంద్రారెడ్డి, మహానంది మాజీ దేవస్థానం చైర్మన్‌ కంచెర్ల సురేష్‌రెడ్డిలను ప్రతిపాదించినట్లు సమాచారం.

సీఎం చంద్రబాబు నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ పదవి తనకే ఇస్తానన్నారని మాజీ కౌన్సిలర్ చింతల సుబ్బనాయుడు పేర్కొనడం గమనార్హం. ఎన్నికలకు ముందు సీఎంను కలిసిన సమయంలో తనకు కూడా చైర్మన్ పదవిపై హామి ఇచ్చారని కాపు డైరెక్టర్ రామచంద్రారావు చెప్పారు. ఎవరికి వారు మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌పై ఆశలు పెంచుకున్న నేపథ్యంలో టీడీపీ అధిష్టానం ఎటూ తేల్చకపోతోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -