Wednesday, May 15, 2024
- Advertisement -

జగన్ సమక్షంలో పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే….. 250కార్ల భారీ కాన్వాయ్‌

- Advertisement -

2014 ఎన్నికల్లో ఎక్కడ వెనుకంజ వేశాడో అక్కడే ఈ సారి తన సామర్థ్యం చూపించాలనుకుంటున్నాడు జగన్. అందుకు అనుగుణంగానే వ్యూహరచన చేస్తున్నాడు. జగన్ వ్యూహాలకు తోడు నాలుగేళ్ళుగా గోదావరి జిల్లాలలకు చంద్రబాబునాయుడు నరకం చూపించడం కూడా వైకాపాకు కలిసొస్తోంది. గోదావరి జిల్లాల్లోనే చాలా గ్రామాల్లో 144 సెక్షన్‌ని చాలా కాలం పాటు విధించి ప్రజలను వేధించింది చంద్రబాబు ప్రభుత్వం. అందుకే ప్రస్తుతం అక్కడి ప్రజల్లో టిడిపిపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే నాయకులందరూ కూడా వైకాపా వైపు చూస్తున్నారు.

Mummidivaram Former MLA Ponnada Satish Kumar Joined YSR Congress Party
Mummidivaram Former MLA Ponnada Satish Kumar Joined YSR Congress Party

ఎన్నికల్లో సీటు ఇష్తానని చెప్పినా చంద్రబాబును అస్సలు నమ్మలేమని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే జగన్ అయితే ఏమీ చెప్పకపోయినప్పటికీ……హామీలు ఇవ్వకపోయినప్పటికీ నమ్ముకున్న వాళ్ళకు న్యాయం చేసే నైజం వైఎస్‌లకు ఉందని చెప్తున్నారు. తాజాగా వైకాపాలో చేరిన తూర్పుగోదావరి జిల్లా, ముమ్మిడవరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. 250 వాహనాల భారీ కాన్వాయ్‌తో నాలుగు మండలాల నుంచి అనుచరులు, నాయకులతో కలిసి వచ్చిన పొన్నాడ సతీష్ కుమార్ గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ సమక్షంలో వైకాపాలో చేరాడు. 2019లో వైకాపాను గెలిపించడం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని జగన్‌కి మాట ఇచ్చాడు సతీష్ కుమార్. వైకాపాలోకి వరుసగా చేరుతున్న నాయకుల బలంతో గోదావరి జిల్లాల్లో సమీకరణాలు పూర్తిగా మారుతున్నాయని ….2014లో ఎక్కడైతే వెనుకంజ వేశాడో ఈ సారి 2019 ఎన్నికల్లో అదే గోదావరి జిల్లాల్లో చంద్రబాబును, టిడిపిని బ్యాక్ సీటులోకి పంపించి జగన్‌కి తన సామర్థ్యం చూపించే అవకాశం కచ్చితంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -