Monday, May 20, 2024
- Advertisement -

కొడుకుని వైకాపాలోకి పంపి బాబుపై కసితీర్చుకున్న మైసూరా?

- Advertisement -

అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా రెచ్చిపోతే ఇలానే ఉంటుందేమో. వైఎస్ జగన్, నరేంద్రమోడీ వ్యక్తిత్వాల గురించి పేజీలకు పేజీలు వ్యక్తిత్వ విశ్లేషణలు చేసిన జనాలు చంద్రబాబు వ్యక్తిత్వాన్ని మాత్రం అస్సలు విశ్లేషించరు కానీ ఆయన నలభైఏళ్ళ ఇండస్ట్రీ చరిత్ర కాకపోయినా ఈ నాలుగేళ్ళ వ్యవహారాలను బయటపెట్టినా బాబు వ్యక్తిత్వం ఏంటో ఇట్టే తెలిసిపోతుంది? భూమానాగిరెడ్డి, మైసూరారెడ్డిలతో పాటు వైకాపాలో ఉన్న ఎంతో మంది సీనియర్ నేతలను బ్లాక్ మెయిల్ చేసి, బెదిరించి మరీ టిడిపిలో చేర్చుకున్నాడు బాబు. ఇక జగన్ వ్యక్తిత్వంపై, నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయమని కూడా పురమాయించాడు. అధికారంలో ఉన్న బాబుకు ఎదురుతిరిగే ధైర్యంలేక బాబు చెప్పినట్టల్లా చేశారు కొంతమంది నేతలు.

అయితే ఇప్పుడు బాబు అధికార పర్వం చివరి దశకు వచ్చిన దశలో వాళ్ళంతా రివేంజ్ కూడా ఓ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ కర్నూలు, నంద్యాల నియోజకవర్గాల్లో నాయకుల గొడవలతో ఇరిటేట్ అయిపోతున్నాడు బాబు. ఇక తాజాగా మైసూరారెడ్డి కూడా చాలా తెలివిగా తన కొడుకును వైకాపాలోకి పంపించాడు. వయసయిపోయిన మైసూరారెడ్డి ఇప్పుడు పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా లేడు. కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఆయన కొడుకుతో కలిసే నడుస్తున్నారు. చంద్రబాబు ఎలాగూ 2019లో అధికారంలోకి రాడు అన్న విషయం అర్థం చేసుకుంటున్న టిడిపి సీనియర్ నేతల తరహాలోనే మైసూరారెడ్డి కూడా చంద్రబాబుకు సూపర్ ఝలక్ ఇచ్చాడు. తన కుమారుడిని వైకాపాలోకి పంపించి అభిమాన వర్గం, అనుచరులు అందరినీ వైకాపాలో చేరేలా చేశాడు. నమ్మిన వాళ్ళను నట్టేట ముంచే నైజం, వాడుకుని వదిలేసే రకం అయిన చంద్రబాబును నమ్ముకుంటే భవిష్యత్ ఉండదని…..తమ కోసం కష్టపడిన వాళ్ళ మేలును ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని మరీ అవసరమైన సమయంలో అండగా నిలిచే నైజం ఉన్న వైఎస్‌లనే నమ్ముకోవాలని కొడుక్కి చెప్పాడట మైసూరారెడ్డి. ఇదే విషయాన్ని ఆయన కొడుకు కూడా చెప్పుకొచ్చాడు. చంద్రబాబు-వైఎస్‌లకు మధ్య ఉన్న తేడా ఏంటో ఆ ఒక్క మాటలోనే చెప్పేశాడు మైసూరారెడ్డి. మొత్తంగా చూస్తే అధికారంలో ఉన్నంత కాలం రెచ్చిపోయి మరీ నాయకులను హింసించిన చంద్రబాబుకు ఇప్పుడు అధికారం చివరి దశలో అదే నాయకులు రివేంజ్ సినిమా చూపిస్తున్నట్టుగా కనిపిస్తోందని సీనియర్ జర్నలిస్టులు వ్యాఖ్యలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -