Sunday, May 19, 2024
- Advertisement -

తడబాటులో.. లోకేష్ తో పోటీ పడుతున్న బాబు..

- Advertisement -

వర్ధంతి రోజు శుభాకాంక్షలు చెప్పడం.. రాష్ట్రాంలో తాగు నీరు లేని ఇబ్బంది ఏర్పాటు చేస్తామని అనడం.. మత పిచ్చి.. కుల పిచ్చి.. కేవలం టీడీపీకే ఉన్నాయంటూ నిజాలు చెప్పేస్తారు! ఇలా చాలా ఆనిముత్యాలు వెతుక్కోవచ్చు.. మంత్రి లోకేష్ ప్రసంగాల్లో.. అయితే తన కొడుకుకి దక్కిన ఘనత తనకి దక్కలేదని చంద్రబాబు బాధపడ్డారో ఏమో కానీ.. చంద్రబాబు కూడా కొడుకు దారిలో వెళ్తున్నాడు.

కొడుకుతో పోటీపడుతూ.. తానేమీ తక్కువ తినలేదని నిరూపిస్తున్నారు. అంతేకాకుండా.. లోకేశ్ నే మించిపోయారు. ఇప్పటివరకు లోకేష్ బాబు తన భాషా అందరికి వినిపిస్తే.. ఇప్పుడు తానేమి తక్కువ తినలేదని.. నిరుపిస్తున్నాడు చంద్రబాబు. తన అధికారిక ట్విటర్ పేజీలోనే తడబడి.. నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయారు. అందరు చంద్రబాబుని ఆదర్శంగా తీసుకోవాలని అంటుంటే.. ఆయన మాత్రం కొడుకును ఆదర్శంగా తీసుకుంటున్నారు. తడబడటంలో తన కుమారుడికి పోటీ ఇస్తున్నారు. తన అధికారిక ట్విటర్ పేజీలో అచ్చు తప్పు పెట్టి విమర్శల పాలయ్యాడు. లోకేష్ బాబుకి పొరపాటుగా పార్టీ సమావేశాల్లో మాట్లాడటం బాగా అలవాటు. ఇప్పుడు చంద్రబాబు కూడా తప్పులో కాలు వేశారు. ఆపదలో ఉన్న మహిళలను కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం గురువారం 181 కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది.

ఇంతవరకు బాగానే ఉంది. ఈ విషయాన్ని తెలుపుతూ.. చంద్రబాబు ట్విటర్ లో పోస్ట్ పెట్టారు. ‘ఆపదలో ఉన్న మహిళలను ఆడుకోవడమే లక్ష్యంగా 181 కాల్ సెంటర్ ఏర్పాటు చేశాము. గృహహింస – ఈవ్ టీజింగ్ – హ్యూమన్ ట్రాఫికింగ్ సమస్యలకు పరిష్కారమవుతాయ’ని ట్వీట్ చేశారు. మహిళలను ఆదుకోవడం అనడానికి బదులు ఆడుకోవడం అని పేర్కొన్నారు. దాంతో బాబుగారి మీద నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -