Saturday, May 18, 2024
- Advertisement -

హరికృష్ణ పార్థివదేహాన్ని టిడిపి కార్యాలయానికి తీసుకెళ్ళకుండా అడ్డుకున్నారా?

- Advertisement -

మరణించిన సమయంలో కూడా నందమూరి హరికృష్ణ దేహంపై పచ్చ చొక్కానే ఉన్నది. పార్టీ స్థాపించిన నాటి నుంచీ పార్టీ కోసం అహర్నిశలూ కష్టపడ్డ హరికృష్ణ పార్థివ దేహాన్ని టిడిపి కార్యాలయంలోకి ఎందుకు అనుమతించలేదు? 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ చేత ప్రచారం చేయించుకున్న తర్వాత నుంచీ లోకేష్‌కి ఎక్కడ పోటీ అవుతాడో అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్‌ని పార్టీకి పూర్తిగా దూరం చేశారు. ఇక హరికృష్ణకు కూడా పార్టీలో ప్రాధాన్యం లేకుండా చేశారు. పార్టీ పుట్టిన నాటి నుంచి ఎన్టీఆర్‌కి రథసారథిగా……..ఒకరకంగా కార్యకర్తలు చేసే పనుల స్థాయి నుంచి నాయకులు చేసే పనుల వరకూ అన్ని కార్యక్రమాలూ చేయడం కోసం అహర్నిశలూ కష్టపడ్డ నందమూరి హరికృష్ణ పార్థివ దేహాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో, టిడిపి కార్యాలయంలో కార్యకర్తల సందర్శన కోసం ఉంచకపోవడంపై ఎన్టీఆర్ అభిమానులు, టిడిపి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నందమూరి కుటుంబ సభ్యుల నుంచి టిడిపి కార్యాలయంలో హరికృష్ణ పార్థివ దేహాన్ని కార్యకర్తల సందర్శనార్థం ఉంచాలన్న ప్రతిపాదనలు వచ్చినప్పటికీ పార్టీ నాయకులు ఆ విన్నపాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని తెలుస్తోంది. అదే సమయంలో హరికృష్ణ చనిపోయిన ఈ సమయంలో కూడా కొందరు స్పాన్సర్డ్ టిడిపి సోషల్ మీడియా కార్యకర్తలు బ్రతికి ఉండి ఉంటే వైకాపాలో చేరి ఉండేవాడు అంటూ అత్యంత అమానవీయంగా సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉండడం కూడా నందమూరి అభిమానుల గుండెల్లో ఆవేదన పెంచుతోంది. పివి నరసింహారావు విషయంలో సోనియా చేసినట్టుగా ఇప్పుడు నందమూరి హరికృష్ణ పార్థివ దేహం టిడిపి కార్యాలయంలో కార్యకర్తల సందర్శనార్థం ఉంచకుండా చేయడంలో ఎవరు ప్రముఖపాత్ర పోషించాలి తెలియాల్సిందేనని నందమూరి అభిమానులు ఆవేదనగా ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా తెలుగు దేశం పుట్టినప్పటినుంచీ పార్టీ కోసం అహర్నిశలూ కష్టపడి………..వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన ఎన్టీఆర్‌తో పాటు రథసారధిగా నాటి సమైక్యాంధ్రప్రదేశ్ మొత్తం నిద్రాహారాలను కూడా పట్టించుకోకుండా తిరిగిన నాయకుడు………….ఎప్పుడూ పచ్చ చొక్కాలే వేసుకోవడానికి ఇష్టపడే నాయకుడు చనిపోతే కనీసం టిడిపి రాష్ట్ర కార్యాలయంలో ఆ నాయకుడి పార్థివ దేహాన్ని కార్యకర్తల సందర్శనార్థం, గౌరవార్థం ఉంచకపోవడం మాత్రం అమానవీయం అని నందమూరి అభిమానులతో పాటు టిడిపి కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -