Sunday, May 19, 2024
- Advertisement -

బాబు బదులు నారా భువనేశ్వరి జాతీయ జెండా ఆవిష్కరణ… కుటుంబ వ్యవహారమా?

- Advertisement -

2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచీ కూడా తనను అడిగేవారు ఎవరూ లేకుండా చూసుకుంటున్నాడు చంద్రబాబు. పూజల, పురష్కారాలు, ఈవెంట్లు, విదేశీ టూర్లు….అంతా ఆయన ఇష్టం. ప్రాజెక్ట్‌ల నిర్మాణం, ప్యాకేజ్‌ల వ్యవహరాలపై ఎవ్వరూ నిలదీయకూడదు అన్నది బాబు సిద్ధాంతం. ఇక రాజధాని నిర్మాణంతో సహా అన్ని వ్యవహారాలను కూడా తన కుటుంబ విషయాలు అన్నట్టుగా డీల్ చేస్తున్నాడు చంద్రబాబు. రాజమౌళితో చర్చించడాన్ని ఎలాగో సమర్థించుకున్నాడు. మరి రాజమౌళి కొడుకుతో కూడా అత్యున్నత స్థాయి అధికారుల సమక్షంలో, అధికారిక సిఎం క్యాంప్ ఆఫీస్‌లో చర్చలు జరపడాన్ని ఏమని అనాలి? రాష్ట్రానికి సంబంధించిన విషయాలను ముఖ్యమంత్రికి ఎవరు నచ్చితే వాళ్ళతో డిస్కస్ చెయ్యొచ్చా?

ఇక నారా చంద్రబాబు నాయుడి కుటుంబ సభ్యుల వ్యవహారాలు కూడా వివాదాస్పదమవుతున్నాయి. ఎమ్మెల్సీ కాకముందే, మంత్రి పదవి లేకముందే నారా లోకేష్ అధికారికి సమావేశాలు నిర్వహించారు. మంత్రుల పేషీల్లో అధికారుల నుంచి అన్ని విషయాలను కూడా తన కనుసన్నల్లో నడిపించాడని టిడిపి మంత్రులే అంతర్గతంగా వాపోతూ ఉంటారు. ఇక తాజాగా బాలకృష్ణ…ఏకంగా సిఎం కుర్చీలోనే కూర్చుని సమావేశాలు నిర్వహించాడు. ఆయన బావగారి కుర్చీయే కదా తప్పేముంది అన్నట్టుగా పచ్చ బ్యాచ్ మాట్లాడుతున్నారు కానీ అది చంద్రబాబు సొంత కుర్చీ కాదు…..బాబు సొంత ఇళ్ళు కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి అది. వాళ్ళ గౌరవానికి సంబంధించిన విషయం. ఇక తాజాగా జనవరి 26న సిఎం అధికారిక నివాసం క్యాంప్ ఆఫీస్‌లో అధికారుల సమక్షంలో, పోలీస్ సెక్యూరిటీ మధ్య నారా భువనేశ్వరి జాతీయ జెండాను ఆవిష్కరించడం వివాదాస్పదమవుతోంది. ముఖ్యమంత్రి చేయాల్సిన ఆ కార్యక్రమాన్ని ఏ పదవీ లేని, ప్రజా ప్రతినిధి కాని, కనీసం గవర్నమెంట్ ఉద్యోగి కూడా కాని నారా భువనేశ్వరి చేత ఎలా చేయిస్తారు? ఒక వేళ ముఖ్యమంత్రి లేకపోతే ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, మొత్తం అధికార వ్యవస్థనే ఉందిగా. వాళ్ళందరినీ కాదని ఏ అర్హతా లేని చంద్రబాబు భార్య చేత జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహింపచేయడం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? లేకపోతే నారావారి రాచరిక పాలన నడుస్తోందా?

సాక్షి మీడియా జగన్‌ని ముంచడానికే పనిచేస్తున్నట్టుగా ఉందికాబట్టి ఇలాంటివి అస్సలు పట్టించుకోదు. పచ్చ మీడియా గురించి, పవన్ కళ్యాణ్ గురించి చెప్పనవసరం లేదు. బాస్ సతీమణి అద్భుతంగా జెండా ఆవిష్కరణ చేసిందని ఆనందంగా గర్వంగా చెప్పుకోగలరు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయంపై నెటిజనులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సమాధానం చెప్పేవారున్నారా? లేకపోతే టైం వచ్చినప్పుడు సరైన బుద్ధి చెప్పే అవకాశం ప్రజలకే ఇస్తారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -