Friday, May 17, 2024
- Advertisement -

లోకేష్ వ్యూహం…. కాపులు టిడిపికి శతృవులు అయ్యేలా చేసిందా?

- Advertisement -

నారా లోకేష్‌కి తొందరెక్కువ. ప్రజాబలాన్ని నిరూపించుకోవాలని, ప్రజా నాయకుడిగా ఎదగాలన్న తొందర అయితే అస్సలు లేదు కానీ వ్యూహ రచనలో తండ్రిని మించిన తనయుడు అనిపించుకోవాలన్న తాపత్రయం మాత్రం లోకేష్‌లో చాలానే ఉంది. దేశంలో పదవి కోసం పడిచచ్చే చాలా మంది నాయకులు వెన్నుపోటు రాజకీయాలు చేశారు. కానీ అందరిలోకి ఎక్కువగా సక్సెస్ అయింది మాత్రం చంద్రబాబే. దానిక్కారణం చంద్రబాబు వ్యూహరచన, కుట్ర సిద్ధాంతాలు ఆ స్థాయిలో ఉంటాయి. ప్రజాబలంతో కంటే ఇలాంటివాటితోనే ఎక్కువ కాలం అధికారంలో ఉన్నాడు చంద్రబాబు. ఇప్పుడు లోకేష్ కూడా ఇలాంటి విషయాల్లోనూ తండ్రిని మించిన తనయుడు అని నిరూపించుకోవాలని తాపత్రయపడుతున్నాడు.

చంద్రబాబు న్యాయవ్యవస్థను మేనేజ్ చేస్తూ ఉంటాడు అన్న ఆరోపణలు, అందుకు తగ్గ సాక్ష్యాలు చాలనే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే లోకేష్ కూడా ఆ మధ్య తమిళనాడులో ఒక నేత బెయిల్ కోసం కోట్లాది రూపాయలు చేతులు మారిన ఇష్యూని నడిపాడన్న ఆరోపణలు ఉన్నాయి. అది కూడా ఢిల్లీలో నారావారికి అత్యంత సన్నిహితుడైన న్యాయమూర్తితో మధ్యవర్తిత్వం నడిపాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక అవినీతి, రాజకీయ వ్యూహాల విషయంలో కూడా చంద్రబాబుకు ఏ మాత్రం తగ్గడం లేదు. మట్టి, ఇసుకతో సహా ఆంధ్రప్రదేశ్ నాట అన్నీ అవినీతి వ్యవహారాలు, అక్రమాలే అని ఢిల్లీస్థాయి సంస్థలు తేల్చిచెప్తున్నాయి. ఇక కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అత్యంత ఎక్కువ అవినీతి ఉన్న నంబర్ ఒన్ రాష్ట్రంగా నిలవడం అంటే మామూలు విషయమా?

అవినీతితో పాటు రాజకీయ వ్యూహాల విషయంలో కూడా తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకోవాలనుకుంటున్నాడు లోకేష్. 2019 ఎన్నికల్లో గెలుపును డిసైడ్ చేసేది కాపు ఓట్లే అన్నది నిజం. 2014లో జగన్‌కి పడిన కాపు ఓట్లు ఈ సారి కూడా కచ్చితంగా జగన్‌కే పడతాయి. అలాగే రుణమాఫీ హామీలతో కాపు రిజర్వేషన్స్ విషయంలో కూడా కాపులను మోసం చేస్తూ కేంద్రానికి ఒక తీర్మానం చేసి చంద్రబాబు చేతులు దులుపుకున్న వైనంతో కాపుల్లో కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. బాబు పాలనతో విసిగిపోయిన ఓట్లతో పాటు పవన్ కూడా కాపు ఓట్లను తీసుకెళ్ళిపోతే 2019లో గెలుపు అసాధ్యం అనుకున్న లోకేష్ పవన్ క్రెడిబిలిటీ దెబ్బతీయడానికి వ్యూహం రచించాడని టిడిపి కాపునేతలే అంతర్గతంగా చెప్తున్నారు. అయితే పచ్చ మీడియా సాయంతో లోకేష్ రచించిన వ్యూహం మొత్తాన్ని ఇప్పుడు పవన్ బయటపెట్టేయడంతో మొత్తం బూమరాంగ్ అయింది. ఆల్రెడీ చిరంజీవిని, చిరంజీవి పార్టీని పరకాల ప్రభాకర్ లాంటి శిఖండులను అడ్డంపెట్టుకుని చంద్రబాబు సర్వనాశనం చేశాడన్న అభిప్రాయం పవన్‌, చిరంజీవిలతో పాటు కాపులకు కూడా బలంగా ఉంది. ఇక ఇప్పుడు పవన్‌ని తొక్కేయాలనుకున్న వ్యవహారం కూడా బయటపడడంతో కాపుల్లో తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వంగవీటి రంగా నుంచి కూడా కాపు నాయకులను పూర్తిగా అణిచే ప్రయత్నాలను చంద్రబాబు చేస్తున్నాడని కాపులు చర్చించుకుంటున్నారు. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం అయితే టిడిపిని సర్వనాశనం చేసేవరకూ…….టిడిపికి పాతరేసేవరకూ పవన్ కళ్యాణ్ ఉద్యమం సాగాలని ఆవేశంగా పిలుపునిచ్చాడు. ఈ మొత్తం వ్యవహారాలను చూస్తే మాత్రం లోకేష్ చేత చంద్రబాబు నడిపించిన వ్యూహం మొత్తంగా కాపులను అందరినీ టిడిపికి శతృవులను చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఇప్పటికే చాలా విషయాల్లో టిడిపిని డిజాస్టర్ దిశగా నడిపించిన లోకేష్ ఇప్పుడు కాపులను కూడా శతృవులను చేసుకోవడంతో ఈ సారి గోదావరి జిల్లాలతో పాటు కాపు ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్న నియోజకవర్గాల్లో టిడిపి పతనం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. టిడిపి కాపు నేతలు కూడా లోకేష్ దెబ్బకు తెలంగాణాలో లాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా టిడిపి పూర్తిగా నాశనం అయ్యేలా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -