Saturday, May 18, 2024
- Advertisement -

హిందూపూర్ నుంచి లోకేష్ పోటీ…

- Advertisement -

రాజ‌కీయాల్లో సొంత బంధువులు, ప‌రాయివాల్లు అనే బేధం ఉండ‌దు. అవ‌స‌రానికి వాడుకోవ‌డం అవ‌స‌రం తీరాక వారిని ప‌క్క‌కు నెట్టేయ‌డం స‌హ‌జం. అ లాంటి రాజ‌కీయాలు చేయ‌డంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు దిట్ట అన్న సంగ‌తి తెల‌సిందే. ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేని త‌న కొడుకు లోకేష్‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చి దొడ్డిదారిన మంత్రిని చేసిన ఘ‌న‌త చంద్ర‌బాబుది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో లోకేష్‌ను దించేందుకు బావ‌మ‌ర‌ది బాల‌కృష్ణ షీట‌కు ఎస‌రు పెట్టారు బాబుగారు. ఈ ప‌రిణామాలు చూస్తుంటె సినీ హీరో బాల‌కృష్ణ రాజ‌కీయాల్లో నుండి త‌ప్పుకోవాల్సిందేనా అన్న వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో లోకేష్ గెల‌వ‌ర‌న్న సంగ‌తి బాబు తెలుసు. అందుకే టీడీపీ కంచుకోట అయిన హిందూపూర్ నియోజ‌క‌వ‌ర్గాన్ని త‌న కొడుకు కోసం సేఫ్ జోన్‌గా ఎంచుకున్నారు. అందుకే అల్లుడితోనె మామ‌కు చెక్ పెట్టే విధంగా పావులు క‌దిపారు.

హిందూపూర్ నియోజ‌క వ‌ర్గం నుంచి 2014 లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నంద‌మూరి బాల‌కృష్ణ 16 వేల ఓట్ల కు పైగా మెజార్టీతో గెలిచారు. అయితే హిందూపూర్ ఎమ్మెల్యే గా బాల‌కృష్ణ ఆశించిన స్థాయిలో ప్ర‌జా మ‌ద్ద‌తు కూడ గ ట్ట లేక పోయారు. బాల‌య్య‌కు వ్య‌తిరేకంగా అనేక నిర‌స‌న కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. దీంతో ఆస్థానంలో ఆయ‌న కుమారు డు లోకేష్ పోటీ చేయ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది.

లోకేష్ కు హిందూపూర్ ఇస్తానంటే బాల‌య్య సైతం అభ్యంత‌రం చెప్పే ఛాన్స్ లేదు. దీంతో..లోకేష్ సునాయాసంగా గెల‌వాలంటే హిందూపూర్ స‌రైన‌దిగా భావిస్తున్న పార్టీ అధినేత‌..ఈ మేర‌కు అక్క‌డి పార్టీ వ్య‌వ‌హారాల‌తో పాటుగా..అభివృద్ది పై దృష్టి సారించాల‌ని త‌న‌యుడు లోకేష్ కు సూచించిన‌ట్లు తెలుస్తోంది.

అల్లు డు కోసం మామ బాల‌య్య త‌న సీటు త్యాగం చేస్తున్నారు. అంత వ‌ర‌కు బాగానే ఉంది..మ‌రి ఇంత‌టితో బాల‌య్య పొలిటిక‌ల్ కేరీర్ ముగుసిన‌ట్లేనా లేకా వేరే నియోజ‌క వ‌ర్గం కేటాయిస్తార అనేది బాల‌య్య ఫ్యాన్స్‌లో హాట్ టాపిక్ గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -