Friday, April 19, 2024
- Advertisement -

పిల్లలకు అలా.. పెద్దలకు ఇలా .. ఏంటిది జగన్ సారూ !

- Advertisement -

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం.. ” ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీ ” . ఈ పథకంలో ప్రజలు రేషన్ షాప్ వద్దకు వెళ్లకుండా రేషన్ సరుకులే నేరుగా ప్రజల ఇంటివద్దకు వచ్చే విధంగా డోర్ డెలివరీ విధానాన్ని ప్రవేశ పెట్టారు. అయితే ఈ పథకంపై మొదటి నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమౌతూనే ఉన్నాయి. ఎందుకంటే ఈ డోర్ డెలివరీ విధానం వల్ల ప్రభుత్వ డబ్బు భారీ మొత్తంలో వృధా అవుతుంది. సరుకులు రవాణా చేసేందుకు వాహనాలకు అయ్యే ఖర్చు అలాగే వాటిని పంపిణీ చేసే వారికి జీతాలు.. ఇలా చాలానే డబ్బు వృధా అవుతుంది. అయితే వైసీపీ మాత్రం డోర్ డెలివరీ విధానాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటూ వస్తోంది.

అయితే ప్రజలకు ఈ డోర్ డెలివరీ విధానం వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదనే వాదనలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే.. గ్రామీణ ప్రాంతాలలో చాలా చోట్ల రేషన్ వాహనాలను తిప్పకుండా డీలర్లు ఉన్న పాత రేషన్ షాపుల వద్దనే రేషన్ పంపిణీ చేస్తున్నారు. దీంతో ప్రజలు గతంలో రేషన్ షాప్ లకు అలవాటు పడడంతో యదావిధిగా రేషన్ షాపుల వద్దకు వెళ్ళే రేషన్ సరుకులు తీసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాంతో ఈ డోర్ డెలివరీ విధానంపై ప్రతిపక్షాల నుంచి మాత్రమే కాకుండా ప్రజల నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఇదిలా ఉండగా ఈ డోర్ డెలివరీ విధానంపై తాజాగా జగన్ సర్కార్ ను హైకోర్టు నిలదీసింది.

రేషన్ సరుకులు కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారా ? అంటూ ప్రశ్నించింది. రేషన్ సరఫరా కొరకు ఏర్పాటు చేసిన వాహనాలతో ప్రజా ధనం వృథా కాదా ? అంటూ నిలదీసింది. “ఇంటింటికి రేషన్ సరఫరా :” ద్వారా ప్రజా ధనాన్ని ఎందుకు వృథా చేస్తున్నారో వివరణ ఇవ్వాలంటూ జగన్ సర్కార్ ను కోరింది హైకోర్టు. ఇక పాఠశాలల విలీనం పేరుతో 3,4,5 తరగతుల పిల్లలను 2 కి.మీ నుంచి 3 కి.మీ వరకు నడిపిస్తూ.. పక్కనే ఉన్న రేషన్ షాపుల వద్దకు వెళ్లకుండా ప్రజలకు వాహనాల ద్వారా సరుకులను ఇళ్ల వద్దకు చేర్చడం ఏంటని కొందరు జగన్ సర్కార్ ను ప్రశ్నిస్తున్నారు.. ఇదే విషయాన్ని హైకోర్టు కూడా ప్రస్తావించింది. నిజానికి ఈ డోర్ డెలివరీ విధానం వల్ల ప్రజాధనం వృథా అవ్వడం తప్ప.. దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ప్రతి సామాన్యుడికి తెలుసు.. ఈ డోర్ డెలివరీ విధానం రద్దు చేసి దాని స్థానంలో మరిన్ని రేషన్ సరుకులు పెంచిన ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.

More Like This

శపథం మరిచిన.. చంద్రబాబు !

పవన్ ” ఆకర్ష్ ” .. మొదలు ?

ఆమ్ ఆద్మీ విస్తరణ.. చాప కింద నీరులా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -