Friday, April 26, 2024
- Advertisement -

పవన్ “ఆకర్ష్”.. మొదలు పెడుతున్నారా ?

- Advertisement -

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసిన జనసేన గురించిన చర్చే జరుగుతోంది. ఎందుకంటే పార్టీ స్థాపించి పదేళ్ళు గడిచిన ఇప్పటివరకు పూర్తి స్థాయిలో పార్టీ నిలదొక్కునున్న సందర్భాలు లేదు.. కానీ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రస్తుతం జనసేన చూపిస్తున్న దూకుడు అందరినీ ఆకర్షిస్తోంది. ఏపీలో జగన్ సర్కార్ వైఫల్యాలను తీవ్ర స్థాయిలో ఎండగడుతూనే.. పార్టీ విధివిధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెల్లే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కల్యాణ్. అలాగే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి ఇతర పార్టీ నేతలను కూడా జనసేనలోకి ఆకర్శించేందుకు సరికొత్త ప్రణాళికలు వేస్తున్నాడట.

ప్రస్తుతం ఇదే పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ ప్రారంభం అయినది మొదలుకొని ఇప్పటివరకు జనసేనలో పెద్దగా చేరికలు జరగలేదు. ఏదో 2019 ఎన్నికల ముందు కొంత మంది జనసేనలో చేరినప్పటికి.. ఆ తరువాత మళ్ళీ కొందరు నేతలు జనసేన కు టాటా చెప్పారు. అయితే ఇతర పార్టీలలోని కీలక నేతలు ఎవరు కూడా జనసేన వైపు చూడలేదు. దాంతో జనసేనను ప్రజల్లోకి బలంగా తీసుకెల్లే నేతలు లేక గత ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూడక తప్పలేదు.

ఇక రాబోయే ఎన్నికల్లో ఆ పరిస్థితులు మళ్ళీ తలెత్తకుండా ఇతర పార్టీలలోని కీలక నేతలను ఆకర్షించే పనిలో పడ్డారట జనసేనాని. ఇప్పటికే టీడీపీ నుంచి కొంత మంది నేతలు జనసేన వైపు చూస్తున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక రాబోయే ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు ఉండవని పవన్ ఇప్పటికే స్పష్టం చేశారు. దాంతో రాబోయే ఎన్నికల్లో సత్తా చాటలంటే ఇతర పార్టీలలోని బలమైన నేతలను ఆకర్శించక తప్పదు. దానికోసం పవన్ జనసేన నేతలతో చర్చించి కమిటీ వేస్తారా ? లేక పవన్ మాటతోనే అందరినీ ఆకర్షిస్తారా ? అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి

మీరు వదిలేస్తే.. మేము సిద్దం !

ఆమ్ ఆద్మీ విస్తరణ.. చాప కింద నీరులా ?

ఉచితలు తెచ్చి పెట్టిన వివాదాలు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -