Wednesday, April 24, 2024
- Advertisement -

మన జాతీయ జెండా కూడా చైనాదే ?

- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలతో దేశంలో పలు కీలక కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటికే ఎన్నో విధానాలను దేశంలో ప్రవేశ పెట్టిన మోడీ.. ఇక దేశంపై ప్రతి పౌరుడు కూడా నిబద్దత చాటుకునేలా.. దేశ భక్తిని మరింత పెంపొందించేలా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించాలని ” హర్ ఘర్ తిరంగా ” .. పేరుతో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలందరూ వారి ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.. ఆగస్ట్ 7 నుంచి వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నివహించనున్నారు.

అయితే ఇది బాగానే ఉన్నప్పటికి దేశ వ్యాప్తంగా ప్రజలందరి ఇళ్లపై జాతీయ జెండా ఉండాలంటే.. పెద్ద మొత్తం లో సిల్క్ కావాల్సి ఉంటుంది. దాంతో జెండాల తయారీకి కావల్సిన సిల్క్ ను ఇండియా చైనా నుంచి దిగుమతి చేసుకోనుంది. ఇక్కడే ప్రతిపక్షాలనుంచి మోడీ నిర్ణయంపై విమర్శలు ఎదురవుతున్నాయి. మనకు శత్రు దేశంగా ఉన్న చైనా నుంచి మన జాతీయ జెండాను దిగుమతి చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా పేరుతో చైనా వస్తువులను బాయ్ కట్ చేయాలని గతంలో చెప్పి ఇప్పుడు చైనా నుంచి మన జాతీయ జెండా సిల్క్ ను దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం మోడీ అసమర్థతకు నిదర్శనం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఒకప్పుడు చైనా యాప్స్ ను నిషేధించడమే కాకుండా చైనా వస్తువులను కొనొద్దని కూడా ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా విషయంలో మాత్రం మోడీ చైనాకు తలోగ్గారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ విమర్శల గురించి పక్కన పెడితే.. ప్రతి భారతీయుడిలోను దేశ భక్తిని మరింత పెంపొందించేల ” ఇంటింటిపై జాతీయ జెండా ” కార్యక్రమం చేపట్టడం నిజంగా హర్షించాల్సిన విషమనే చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

వెంకయ్య తప్పుకున్నాడా ? తప్పించరా ?

మద్యపాన ఆదాయంపై.. జగన్ చూపు ?

ఫ్రీడం ఫైటర్స్ ను తీడితే పబ్లిసిటీ పెరుగుతుందా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -