Thursday, May 16, 2024
- Advertisement -

బాబుకు బిగ్ షాక్‌.. టిడిపిలో మొదలైన క‌ల‌క‌లం…

- Advertisement -

ఆంధ్రా ఆక్టోప‌స్‌,స‌ర్వేల రారాజు ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌కు మంచి పేరుంది. ఆయ‌న చేసె స‌ర్వేల‌లో ఏది వ‌చ్చినా అదిసంచ‌ల‌న‌మే. గ‌తంలో కూడా ఆయ‌న చేసిన స‌ర్వేలు దాదాపు నిజ‌మ‌య్యాయి. కాని ఇప్పుడు ఏపీలో ఆక్టోప‌స్ స‌ర్వేలో సంచ‌ల‌న నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. స‌ర్వేలో టీడీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని వార్త‌లు వ‌చ్చినా అస‌లు విష‌యం వేరే ఉంది.

అలాంటి తాజా సర్వే పేరుతో ఓ నివేదిక టిడిపిలో కలకలం మొదలైంది. టిడిపి పరిస్ధితిపై ఈమధ్యే రాజగోపాల్ ఓ సర్వే చేయించారనేది తెలిసిందే. మ‌రోసారి టీడీపీనె అధికారంలోకి వ‌స్తుంద‌నె వార్త‌లు వెలువ‌డ్డాయి. అస‌లు విష‌యం అది కాదంట‌. పార్టీ పరిస్ధితి ఏ ప్రాంతంలో ఎలావుందనే విషయంలో ఈ స‌ర్వే నిర్వ‌హించారంట‌. అయితే స‌ర్వేలో టీడీపీకి షాకింగ్ నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. కొద్ది రోజుల క్రితం ల‌గ‌డ‌పాటి చంద్ర‌బాబును క‌లిశారు. అప్పుడే నివేదిక‌ను ఇచ్చారంట‌.

స‌ర్వే ఆధారంగానె చంద్రబాబు తమ్ముళ్ళకు ఫుల్లుగా క్లాసులు పీకుతున్నారట. స‌ర్వే ప్ర‌కారం ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో పార్టీకి ఆధ‌ర‌ణ త‌గ్గుతోండంతోపాటు ….గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్య‌తిరేక‌త పెద్ద ఎత్తును ఉందంట‌. ప్ర‌ధానంగా రేషన్ కార్డులు, పెన్షన్లు అందకపోవటం, రోడ్ల వ్యవస్ధ అస్తవ్యస్ధంగా ఉండటం, నేతలు అందుబాటులో ఉండకపోవటం లాంటి అనేక సమస్యలు జనాలను పట్టి పీడిస్తున్నాయట. ప్ర‌జ‌ల‌కు ఏ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందాల‌న్నాజన్మభూమి కమిటీల ఆమోదం తప్పని సరి చేయటంతో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. .

మొన్న నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల్లో గెల‌వ‌డంతో టీడీపీ మంచి జోష్‌మీదుంది. అట్లాంటి ఎన్నిక‌లు ప్రత్యేక పరిస్ధితిల్లో మాత్రమే సాధ్యమైందని కూడా లగడపాటి స్పష్టగా చెప్పారట. సాధారణ ఎన్నికలకు మొన్నటి ప్రత్యేక పరిస్ధితులుండవన్నది లగడపాటి అభిప్రాయం. నిరుద్యోగులకు ఇస్తానన్న రూ. 2 వేల భృతి ఇవ్వకపోవటం కూడా గ్రామీణ ప్రాంత యువతలో ప్రభుత్వంపై వ్యతరేకత వ‌స్తోందంట‌.

వ్యవసాయ, పారిశ్రామికరంగాలను కుదించేయటం లాంటి అనేక అంశాల్లో జనాల్లో వ్యతిరేకత స్పష్టంగా కనబడుతోందట. నంద్యాల ఫార్ములనే సాధారణ ఎన్నికల్లో కూడా అమలు చేయాల‌ని పార్టీ నేత‌ల‌కు పిలుపు నిచ్చారు. వ‌చ్చె ఎన్నిక‌ల్లో దీన్నె అమ‌లు చేయాల‌ని చెప్పిన బాబుకు లగడపాటి సర్వే రిపోర్టు పెద్ద షాక్ అనే చెప్పాలి. మ‌రి దీనిపై తెలుగు త‌మ్ముళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -