Thursday, May 2, 2024
- Advertisement -

లగడపాటి ఎంట్రీతో కేశినెని సెట్..!

- Advertisement -

విజయవాడ పాలిటిక్స్ రోజుకో మలుపు తిరుగుతున్నాయి. విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని టీడీపీ పార్టీపైనే విమర్శలు చేస్తూ చంద్రబాబుకు తలనొప్పిగా మారారు. ఇదే సమయంలో వైసీపీ నేతలతో టచ్‌లో ఉంటూ పొలిటికల్ హీట్ పెంచేశారు. దీంతో కేశినేని వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేస్తారా లేదా అసలు పోటీ నుండే తప్పుకుంటారా అన్న సందిగ్దం నెలకొంది.

ఈ క్రమంలో అనూహ్యంగా బెజవాడ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు ఆంధ్రాఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్. రాష్ట్ర విభజనతో రాజకీయాలకు దూరమైన ఆయన మనసు మార్చుకుని తిరిగి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో లగడపాటి టీడీపీలో చేరడం ఖాయమనే ప్రచారం కూడా జరిగింది.

అంతే ఒక్కసారిగా తన మనసు మార్చుకున్నారు కేశినేని నాని. టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు గుప్పించారు.దేశంలో నిజాయతీ ఉన్న కొద్దిమంది నేతల్లో నారా చంద్రబాబు ఒకరని ..ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతి మచ్చ లేదని చెప్పుకొచ్చారు. కొంద‌రు మచ్చ‌లు అతికించేందుకు ప్ర‌య‌త్నించార‌ని.. కానీ సాధ్యం కాలేద‌ని అన్నారు. ఐటీ నోటీసులు, అనంత‌ర ప‌రిణామాల‌పై చంద్ర‌బాబే స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు సమాధానమిస్తారని అన్నారు. ఇక తాను ఎంపీగానే పోటీచేస్తానని…హ్యాట్రిక్ కొట్టితీరుతానని వెల్లడించారు. ఒక్కసారిగా నాని స్వరం మార్చడం వెనుక లగడపాటి ఎంట్రీనే కారణమని అంతా భావిస్తున్నారు. ఏదిఏమైనా రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చని…ఒకవేళ లగడపాటి, టీడీపీలో చేరితే విజయవాడ ఎంపీ సీటు ఆయనకే దక్కినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బెజవాడలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -