Friday, May 17, 2024
- Advertisement -

ప‌రిటాల కుటుంబానికి షాక్ ఇచ్చిన బాబు..పోటీ నుంచి త‌ప్పుకున్న సునీత‌..?

- Advertisement -

టీడీపీ టికెట్ల కేటాయంపు కొన్ని కుటుంబాల్లో చిచ్చురేపుతోంది. ఈ సారి ఎన్నిక‌ల్లో సీనీయ‌ర్‌నేత‌లు త‌మ వార‌సుల‌ను బ‌రిలోకి దింపాల‌ని పావులు క‌దుపుతున్నారు. త‌మ‌కు టికెట్టు ద‌క్క‌క‌పోయినా ప‌రువాలేదుగాని వార‌సుల కోసం త్యాగాలు చేస్తున్నారు. త‌మ వార‌సుల‌కు టికెట్టు ఇవ్వాల‌ని బాబును కోరుతున్నారు. ఈ విష‌యంలో జేసీ సోద‌రులు విజ‌యం సాధించినా ప‌రిటాల కుటుంబం మాత్రం ఫెయిల్ అయ్యింద‌నే చెప్పాలి. త‌మ కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వాల‌ని మంత్రి ప‌ర‌టాల సునీత గ‌త కొన్ని నెల‌లుగా బాబు డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే బాబు ఇచ్చిన షాక్‌కు పోటీ నుంచే ప‌రిటాల సునీత త‌ప్పుకున్న‌ట్లు స‌మాచారం.

మొద‌టినుంచి పరిటాల కుటుంబం రాప్తాడు, కల్యాణదుర్గం టికెట్లను తమకు కేటాయించాలని టీడీపీ అధిష్టానాన్ని కోరుతూ వ‌చ్చింది. రెండు టికెట్లు మా కుంటుంబానికే బాబు కేటాయిస్తార‌ని చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. ప‌రిటాల కుటుంబం ఆశ‌లపై నీళ్లు చ‌ల్లారు బాబు. ప‌రిటాల కుటుంబానికి రాప్తాడు టికెట్‌ను మాత్ర‌మే కేటాయించారు. అయితే ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్‌ ఆసక్తి కనరుస్తున్నారు. అభిమానుల కొర‌కు ఈ సారి శ్రీరామ్ పోటీ చేస్తార‌ని ప్ర‌క‌టించింది. బాబు రెండు టికెట్లు కేటాయించ‌క పోతే రాప్తాడు నుంచి శ్రీరామ్ పోటీ చేస్తార‌ని తెలిపారు.

ఏపీ ఎన్నికల్లో పోటీచేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబును రెండు సీట్లు అడుగుతున్నామని వెల్లడించారు. అందుకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అంగీకరించకపోతే తాను పోటీకి దూరంగా ఉంటానని, శ్రీరామ్ పోటీ చేస్తారని ఆమె అన్నారు. త‌న నిర్ణ‌యాన్ని బాబు దృష్టికి తీసుకెల్తాన‌ని సీఎం ఆదేశ మేర‌కు న‌డుచుకుంటామ‌ని సునీత వెల్ల‌డించారు.

ఇద‌లా ఉంటే రాప్తాడు నుంచి శ్రీరామ్‌ పోటీపై సునీత కుటుంబంలో అభిప్రాయ భేదాలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. శ్రీరామ్‌ పోటీని కుటుంబంలోని మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మరోసారి సునీతే ప్రాతినిథ్యం వహించాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -