బాలయ్య షో లో పవన్ క్లారిటీ.. ఇస్తారా ?

Pawan Kalyan Give Clarity in Balakrishna Unstoppable Show
Pawan Kalyan Give Clarity in Balakrishna Unstoppable Show

జనసేన అధినేత పవన్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పవన్ ప్రణాళికలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు. దాంతో ఈ మద్య పవన్ చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఎప్పటికప్పుడు పోలిటికల్ హిట్ ను పెంచుతూనే ఉన్నాయి. విశాఖలో జరిగిన పరిణామాలు మొదలుకొని.. ఇటీవల జరిగిన వారాహి వివాదం వరకు పవన్ వేస్తున్న ప్రతి అడుగు కూడా ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతూనే ఉంది. ఇక తాజాగా పవన్.. బాలయ్య టాక్ షో ” ఆన్ స్టాపబుల్ ” లో పాల్గొనడం.. సినీ రాజకీయ రంగాల్లో హాట్ హాట్ డిబేట్లకు కారణం అవుతోంది.

గతంలో పవన్ బాలయ్య మద్య డైలాగ్ వార్ గట్టిగానే నడిచింది.. జనసేన మరియు పవన్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి ” సంకరజాతి వాళ్ళు .. ” అంటూ బాలయ్య గతంలో చేసిన వ్యాఖ్యలు పెను దుమారన్నే రేపాయి. ఇక బాలయ్య వ్యాఖ్యలకు కౌంటర్ గా పవన్ కూడా అదే ఫైర్ అయ్యారు. మెగా బ్రదర్ నాగబాబు కూడా బాలయ్య పై ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్ చేస్తే ఇప్పుడు బాలయ్య షోకు పవన్ చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మద్య ఎలాంటి సంబాషణ జరగనుంది ? పవన్ పై బాలయ్య ఎలాంటి ప్రశ్నలు సంధించబోతున్నారు ? అనే అంశాలపై అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది. ముఖ్యంగా టీడీపీతో పొత్తు అంశాన్ని బాలయ్య ప్రస్తావిస్తారా ? ఒకవేళ ప్రస్తావిస్తే పవన్ నుంచి ఎలాంటి సమాధానం రానుంది ? అనే దానిపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

గత కొన్ని రోజులుగా టీడీపీ జనసేన మద్య పొత్తుపై పదే పదే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటు వైసీపీ నేతలు కూడా ఆ రెండు పార్టీల మద్య పొత్తును కన్ఫర్మ్ చేస్తూనే ఉన్నారు. అయితే అటు టీడీపీ గాని, ఇటు జనసేన గాని పొత్తు విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. దాంతో బాలయ్య టాక్ షో లో పొత్తుపై పవన్ నోరు విప్పే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక పవన్ పై పదే పదే వినిపించే విమర్శ మూడు పెళ్లిళ్ల వ్యవహారం.. తనూ ఎందుకు మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చింది అనే దానిపై పవన్ ఎప్పుడు కూడా స్పష్టత ఇవ్వలేదు. అందువల్ల దీనిపై కూడా బాలయ్య ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది.. మరి ప్రత్యర్థి పార్టీ నేతల నుంచి ప్రధానంగా వినిపించే విమర్శల్ కావడం వల్ల పవన్ ఈ వ్యవహారంపై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికి బాలయ్య టాక్ షో కు పవన్ రావడంతో అటు రాజకీయాల్లోనూ ఇటు సినీ ఇండస్ట్రీలోనూ హాట్ హాట్ డిబేట్లు జరుగుతున్నాయి. మరి. ఈ షో ద్వారా పవన్ ఏ ఏ అంశాలపై క్లారిటీ ఇస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

బి‌ఆర్‌ఎస్ వైరస్.. బీజేపీ వ్యాక్సిన్ !

వాలెంటిర్లపై.. టీడీపీ ఫోకస్ !

టార్గెట్ సి‌ఎం పదవి.. బీజేపీ ఓపెన్ ఆఫర్ !