Monday, April 29, 2024
- Advertisement -

ప్రభాస్ తో సుక్కు మూవీ.. అప్పుడే ?

- Advertisement -

నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కంప్లీట్ అయిన ” ఆది పురుష్ ” తో పాటు సలార్, ప్రాజెక్ట్ కే , మారుతి ప్రాజెక్ట్ సెట్స్ పై ఉన్నాయి. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ” స్పిరిట్ ” మూవీ కూడా లైన్ లో ఉంది. ఇక తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ కు ప్రభాస్ ఓకే చెప్పినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆది కూడా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలోనట.పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ తో పాటు సుకుమార్ కు కూడా మంచి క్రేజ్ ఉంది. పుష్ప మూవీతో సుకుమార్ పేరు నార్త్ లో కూడా మారు మ్రోగుతోంది. అలాంటిది ప్రభాస్ సుకుమార్ కాంబినేషన్ లో మూవీ ఫిక్స్ అయితే టోటల్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం ఖాయం. .

అయితే ఈ క్రేజీ కాంబినేషన్ నిజమేనా లేదా రూమర్ మాత్రమేనా అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేనప్పటికి.. అటు నార్త్ లోనూ ఇటు సౌత్ లోనూ ప్రస్తుతం ఈ కాంబినేషన్ కు సంబంధించిన చర్చే ఎక్కువగా జరుగుతోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు.. సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ తరువాత రామ్ చరణ్ తో ఓ మూవీ చేయనున్నడనే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంచితే సుకుమార్ తో మూవీ చేసేందుకు బాలీవుడ్ నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ అడ్వాన్స్ కూడా ఇచ్చిందట. ఈ నిర్మాణ సంస్థలో ఓ భారీ మూవీ చేసేందుకు సుక్కు తో డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

దీనికి సంబందించి ఆ మద్య అధికారిక ప్రకటన కూడా వెలువడిన సంగతి తెలిసిందే. అయితే హీరో ఎవరనే దానిపై క్లారిటీ లేదు. కాగా అభిషేక్ అగర్వాల్ ప్రొడక్షన్ లో ప్రభాస్ ఓ మూవీ చేయబోతున్నాడని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుకుమార్ కూడా ఇదే ప్రాడక్షన్ సంస్థలో మూవీకి కమిట్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ ప్రభాస్ సుక్కు కాంబినేషన్ అంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. ఒకవేళ ఇదే గనుక నిజం అయితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం ఖాయంగా తెలుస్తోంది. మరి ఈ డెడ్లీ కాంబినేషన్ నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరో ప్రయోగానికి సిద్దమైన రామ్ చరణ్ !

అఖిల్ ఏజెంట్ మూవీ ఆ రేంజ్ లో ఉంటుందా ?

వారసుడు మహేశ్ కథే !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -