Friday, May 3, 2024
- Advertisement -

టార్గెట్ సి‌ఎం పదవి.. బీజేపీ ఓపెన్ ఆఫర్ !

- Advertisement -

తెలంగాణలో బీజేపీ వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే అధికార టి‌ఆర్‌ఎస్ పార్టీకి ధీటుగా బలాన్ని పెంచుకుంది కాషాయ పార్టీ. ఇక ఇదే దూకుడును ఎన్నికల వరకు కొనసాగిస్తూ వచ్చే ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా ఉన్నారు కమలనాథులు. అందులో భాగంగానే నిత్యం ప్రజల్లో ఉండేందుకు వ్యూహాలు రచిస్తూనే మరోవైపు టి‌ఆర్‌ఎస్ కు షాక్ ఇచ్చే ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర ద్వారా పార్టీకి మైలేజ్ తెచ్చే పనిలో ఉన్నారు. ఇక ఎన్నికల సమయానికి ఆపరేషన్ ఆకర్ష్ ను కూడా బలంగానే అమలు చేయనుంది కాషాయ పార్టీ. .

ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్శించేందుకు చేరికల కమిటీ చైర్మెన్ గా ఈటెల రాజేందర్ ను నియమించింది. ఆయనకు టి‌ఆర్‌ఎస్ పార్టీ నేతలతో మంచి సంబంధలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో టి‌ఆర్‌ఎస్ నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని ఈటెల ఇప్పటికే పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇదిలా ఉంచితే ఇతర పార్టీల నేతలను ఆకర్శించేందుకు ప్రస్తుతం నయా వ్యూహాన్ని సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే బీజేపీలో చేరితే సి‌ఎం పదవి గ్యారెంటీ అనే ప్రస్తావనను తెరపైకి తీసుకొచ్చింది. ఇటీవల తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ ” సి‌ఎం పదవి కావాలనే ఆశ ఉన్నవాళ్ళు బీజేపీ లో చేరాలని, టి‌ఆర్‌ఎస్ లో ఉంటే ఎప్పటికీ సి‌ఎం కాలేరని వ్యాఖ్యానించారు. కే‌సి‌ఆర్ తన కొడుకును మాత్రమే సి‌ఎం చేస్తారని, ఇంకెవరికి అవకాశం ఇవ్వరని చెప్పుకొచ్చారు బండి సంజయ్.

కాగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే.. తెలంగాణలో బీజేపీ తరుపున సి‌ఎం అభ్యర్థిగా బండి సంజయ్ ఉంటారనేది మొదటి నుంచి వినిపిస్తున్న సమాచారం. అయితే తాజాగా బండి సంజయ్ ఎవరైనా సి‌ఎం అవ్వోచ్చు అనే విధంగా చెప్పడంతో..ఆయన సి‌ఎం అభ్యర్థి కాదా ? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చాలమంది. అయితే ఇదంతా కూడా కాషాయ పార్టీ అనుసరిస్తున్న పోలిటికల్ స్ట్రాటజీ అని కొందరి అభిప్రాయం. ఇతర పార్టీల నేతలను ఆకర్శించేందుకే కమలనాథులు సి‌ఎం పదవి ఆఫర్ ను ఎరగా వేస్తున్నారని రాజకీయ వాదాలు చెబుతున్నా మాట. మరి ఏ రాజకీయ నేతకైనా సి‌ఎం పదవి అంటే కొంత మేర ఆశ ఉండడం సహజం. దాంతో ఈ బలహీనతను క్యాష్ చేసుకునే విధంగా బీజేపీ వ్యూహాలు చేస్తోందని పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. మొత్తానికి తెలంగాణ బీజేపీ బాస్ బండి సంజయ్ సి‌ఎం కావాలనుకునే వారు బీజేపీలో చేరాలని చెప్పడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి

చంద్రబాబు స్టైల్ మార్చింది ఆయనే!

మోడీని తిట్టడమే వారి పని : ప్రధాని మోడీ కామెంట్స్ !

పొత్తులను నమ్ముకోలేదు: సి‌ఎం జగన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -