Wednesday, May 8, 2024
- Advertisement -

బి‌ఆర్‌ఎస్ వైరస్.. బీజేపీ వ్యాక్సిన్ !

- Advertisement -

తెలంగాణలో ప్రధానంగా పోటీలో ఉన్న పార్టీలు ఏవి అంటే ఎవరైనా బీజేపీ, టి‌ఆర్‌ఎస్ అని తడుముకోకుండా చెబుతారు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ప్రధానంగా ఈ రెండు పార్టీలే రేస్ లో ఉన్నాయి. అధికారం కోసం నువ్వానేనా అన్నట్లుగా పోటు పడుతున్నాయి దాంతో ఇరు పార్టీల మద్య చోటుచేసుకుంటున్న రాజకీయ రగడ, విమర్శ ప్రతి విమర్శలు పోలిటికల్ హిట్ ను పెంచుతున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్న కమలనాథులు.. నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నం అయి ఉన్నారు. ఇక ప్రజా సంకల్ప యాత్ర పేరుతో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు గట్టిగానే రెస్పాన్స్ వస్తోంది. .

ఇప్పటికే నాలుగు విడతలుగా పాదయాత్రను కంప్లీట్ చేసిన బండి సంజయ్.. ఐదవ విడతను కూడా ఇటీవల ప్రారంభించారు. కాగా తన సొంత ఇలాఖ అయిన కరీంనగర్ లో పాదయాత్ర చేపట్టిన బండి సంజయ్ కి వ్యతిరేకంగా ఫ్లెక్సిలు వెలిశాయి. లోక్ సభ స్థానంలో ఉండి కరీంనగర్ లో ఏం అభివృద్ది చేశారో చెప్పాలంటూ ఆ ఫ్లెక్సిలలో రాసుకొచ్చారు. అయితే ఆ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు అనే దానిపై ఎలాంటి సమాచారం లేనప్పటికి.. అది టి‌ఆర్‌ఎస్ పనే అంటూ కమలనాథులు మండి పడుతున్నారు. తాజాగా దీనిపై స్పందించిన బండి సంజయ్.. బి‌ఆర్‌ఎస్ నేతలకు వ్యతిరేకంగా తాము ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వాళ్ళు తలెత్తుకోలేరని వ్యాఖ్యానించారు. ఇలాంటి వాటికి బీజేపీ వెనుకడుగు వేయబోదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని బి‌ఆర్‌ఎస్ వైరస్ లా పట్టి పిడిస్తోందని,.. ఆ వైరస్ కు బీజేపీ మాత్రమే విరుగుడు అని చెప్పుకొచ్చారు. బి‌ఆర్‌ఎస్ వైరస్ లాంటిది అయితే బీజేపీ వ్యాక్సిన్ లాంటిది అని వ్యాఖ్యానించారు బండి సంజయ్. మరి వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు కదులుతున్న బీజేపీకి తెలంగాణ ప్రజలు ఎలాంటి ఫలితాన్ని కట్టబెడతారో చూడాలి.

ఇవి కూడా చదవండి

వాలెంటిర్లపై.. టీడీపీ ఫోకస్ !

పవన్ బస్సు యాత్రతో.. వైసీపీకి భయం పట్టుకుందా ?

వైసీపీపై కుట్ర.. జరుగుతోందా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -