Thursday, May 16, 2024
- Advertisement -

వ‌ర్మ వ‌ర్సెస్ టీడీపీ తెలుగు త‌మ్ముళ్లు…

- Advertisement -

ఎన్టీఆర్ బ‌యోపిక్ చిత్రం విష‌యంలో వివాదాల డైరెక్ట‌ర్ వ‌ర్మ టీడీపీ శ్నేణుల మ‌ధ్య ర‌చ్చ మొద‌ల‌య్యింది. రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. శుక్రవారం ఈ సినిమాలోని ‘వెన్నుపోటు’ పాటను రిలీజ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఈ పాట ఇప్పుడు కేంద్ర బిందువుగా మారింది.

రామ్ గోపాల్ వర్మ విడుదల చేసిన పాట ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును అవమానించేలా ఉందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు ప్రతిష్ఠను దిగజార్చేందుకే కొందరు వర్మను ముందు పెట్టుకుని ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వర్మతో పాటు కుట్ర వెనుకున్న వారిపైనా చర్యలు తీసుకోవాలంటూ ఏపీ వ్యాప్తంగా పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి వర్మపై కర్నూలు వన్‌టౌన్ పీఎస్‌లో వర్మపై ఫిర్యాదు చేశారు. వ‌ర్మ దిష్టిబొమ్మ‌ల‌ను కూడా ద‌గ్ధం చేశారు.

వర్మ ఒక్కడే ఈ పని చేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదనీ, వెనుక ఉండి శిఖండి రాజకీయాలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరామన్నారు. ఈ వ్యవహారం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. దమ్ముంటే సదరు నేతలు ముందుకొచ్చి చంద్రబాబును ఎదుర్కోవాలని సవాలు విసిరారు.

తెలుగు త‌మ్ముళ్ల‌పై వ‌ర్మ ఘాటాగా ఫైర్ అయ్యారు. ముందుగా ఆ పాటలోని అర్థాన్ని తెలుసుకోవాలని, అవసరమైతే దానికి కౌంటర్‌ ఇవ్వాలన్నారు. అంతేకానీ ఈ దిష్టిబొమ్మలు తగలబెడితే ఏం వస్తుందని ప్రశ్నించాడు.గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఎందుకు తడుముకుంటున్నారని టీడీపీ నేతలను ఉద్దేశించి నిలదీశాడు. జాతిపిత మహాత్మగాంధీ బయోపిక్‌లోనే అన్ని విషయాలు చూపించారని గుర్తు చేశాడు. బయోపిక్‌ అంటే అన్ని చూపించాలని, కొంత మాత్రమే చూపిస్తే అది బయోపిక్‌ ఎలా అవుతుందన్నాడు.

రియల్‌స్టార్‌ సినిమా కాబట్టే రియల్‌ పాత్రలకు సంబంధించిన ఫొటోలు వాడినట్లు పేర్కొన్నాడు. ఇది కల్పిత కథ కాదని, ఫిల్మ్‌మేకర్‌గా తాను పరిశోధన చేసి తెలుసుకున్న కథతో సినిమా తీస్తున్నానన్నాడు. ఒక్క పాటను చూసే ఎందుకు భయపడుతున్నారని, సినిమా చూస్తేనే ఎవరేవరేం చేశారో తెలుస్తుందని తెలిపాడు.

వైస్రాయ్‌ హోటల్లో జరిగింది వెన్నుపోటేనని ఎన్టీఆరే చాలా సార్లు చెప్పారని, తానేం కొత్తగా కల్పించలేదన్నాడు. తనకు ఎవరీ మీద కోపం, ప్రేమ లేదన్నాడు. ఎన్టీఆర్‌ జీవితంలో జరిగిందే నిజాయితీగా చూపిస్తానని, తనకు ఎవరీ మద్దతు అవసరంలేదన్నాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -