Wednesday, May 7, 2025
- Advertisement -

ఉప్పు నిప్పు కలిసిన వేళ!

- Advertisement -

ఉప్పు, నిప్పు కలుస్తాయా ? అంటే ఎవ్వరైనా కలవయనే అంటారు. ఒక వేల నిప్పుపై ఉప్పు పడ్డా, ఉప్పు పై నిప్పు పడ్డా టప, టప మని శబ్దం వస్తుంది. కొందరు రాజకీయ నాయకులు కూడా ఎప్పుడూ ఉప్పు నిప్పులానే ఉంటారు. మీకు అప్పుడే అర్ధమైపోయి ఉంటుంది మనం ఎవ్వరి గురించి మట్లాడుతున్నామో..!

ఇంకెవ్వరు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, నల్గొండ ఎంపీ కోమటి రెడ్డి వీళ్లిద్దరు ఉప్పు నిప్పులా ఉంటారు. ఒకరంటే ఒకరికి పడదు. రేవంత్ రెడ్డిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పలుమార్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో హుజూరాబాద్ ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు తెచ్చుకునేందుకు ప్రయత్నించమని రేవంత్ రెడ్డిని ఎంపీ వెంకట్‌ రెడ్డి విమర్శిస్తూనే, సూచనలు చేశారు.

నేడు ఇందిరాపార్క్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఇద్దరు నేతలు ఒకే వేదికపైకి వచ్చారు. అంతేకాదు. ఇద్దరు ఆలింగనం చేసుకున్నారు. చూసే వారికి ఇద్దరు నాయకులు ఒకరిపై మరొకరికి అభిమానం ఉందనే విధంగా ఇరువురు నేతలు ప్రవర్తించారు. బయటకు నవ్వుతూనే ఉన్నా ఇరువురు నేతలకు లోపల ఉండే వేడి లోపలే ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

సీఎం కేసీఆర్ వ్యూహం ఫలించిందా ?

బాబు సంస్కారానికి జగన్ నమస్కారం

చంద్రబాబును నడిపిస్తున్న పికే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -