రోషం అన్నారు.. బొక్క బోర్లా పడ్డారు..!

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు పూర్తి భరోసా వచ్చిందని.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. అమరావతి ప్రాంత ప్రజలను అవమానించిన చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. ఉద్యమం లేకపోయినా కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి ఇంకో ప్రాంతాన్ని మోసం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారని వ్యాఖ్యానించారు. విజయవాడ, గుంటూరు ప్రజలను చంద్రబాబు రెచ్చగొట్టినా ప్రయోజనం లేదన్నారు.

విజయవాడ, గుంటూరు ప్రజలు తమ రోషాన్ని చూపించి చంద్రబాబును ఓడించారని సజ్జల పేర్కొన్నారు. లేని సమస్యలు సృష్టిస్తూ… ప్రజలను చంద్రబాబు మోసం చేశారన్నారు. అమరావతిలో చంద్రబాబు చేసిన మోసాన్ని జగన్ సరిదిద్దే ప్రయత్నం చేశారని, సీఎం ప్రయత్నాన్ని అమరావతి ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. రెండు రోజుల్లో ఛైర్​పర్సన్లు, మేయర్ అభ్యర్థులను సీఎం జగన్ ఖరారు చేస్తారని, అన్ని సామాజిక వర్గాలకు పూర్తి న్యాయం చేస్తూ ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు.

శాతం పెరిగింది.. కేటీఆర్ కుష్ కుష్..!

ధోనీ కొత్త అవతారం మిస్టరీ వీడింది!

స్వల్ప ఘర్షణల మినహా.. తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్!