Sunday, May 4, 2025
- Advertisement -

చిరాగ్​ పాశ్వాన్​కు షాకిచ్చిన సొంతపార్టీ ఎంపీలు..!

- Advertisement -

లోక్​జనశక్తి పార్టీలో చీలిక ఏర్పడింది. ఆ పార్టీ అధినేత చిరాగ్​ పాశ్వాన్​పై సొంతపార్టీ ఎంపీలు తిరుగుబాటు చేశారు. తమను లోక్​సభలో వేరుగా గుర్తించాలని.. వారు స్పీకర్​ ఓం బిర్లాకు లేఖ రాశారు. త్వరలో వారు జేడీయూలో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. రామ్​విలాస్​ పాశ్వాన్​ మరణాంతరం ఆ పార్టీ బాధ్యతలను చిరాగ్​ పాశ్వన్​ చూసుకుంటున్న విషయం తెలిసిందే.

అయితే అప్పటి నుంచి కొందరు నేతలు చిరాగ్​ నాయకత్వం పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అంతేకాక.. ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.చిరాగ్ కి బంధువులైన పశుపతి కుమార్ పరాస్, ప్రిన్స్ రాజ్…మరో ముగ్గురు ఎంపీలు చందన్ సింగ్, వీణా దేవి, మెహబూబ్ అలీ కైసర్ ఏడాది నుంచి చిరాగ్ తో విభేదిస్తున్నారు. ప్రస్తుతం వారి లేఖ జాతీయ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నది.

అయితే ఈ వ్యవహారంపై చిరాగ్​ పాశ్వాన్​ ఇంకా స్పందించలేదు. ఇదంతా జేడీయూ కుట్ర అని పాశ్వాన్​ సన్నిహితులు అంటున్నారు. ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళుతుందో వేచి చూడాలి. బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లోక్​జనశక్తి స్వతంత్రంగా పోటీచేసినప్పటికీ ఘోరంగా ఓటమి పాలైంది.

Also Read

పంజాబ్​లో కొత్త పొత్తు..! బీజేపీకి నష్టం తప్పదా?

బీజేపీకి సీన్​ రివర్స్​.. పార్టీ నుంచి ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలు ?

యూపీ సీఎం యోగిని మార్చేస్తారా? నిజమెంత?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -