భీహార్ లో బీజేపీ పతనం.. దేనికి సూచన ?

ప్రస్తుతం బిహార్ రాజకీయాలు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఎవరు ఊహించని విధంగా ఎన్డీయే కూటమితో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జేడీయూ.. అనూహ్యంగా ఎన్డీయే నుంచి తెగతెంపులు చేసుకుంది. జేడీయూ అధినేత బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గత కొంత కాలంగా బీజేపీ తీరుపై తీవ్ర అసహనంగా ఉన్నారు. కేంద్రంలో జేడీయూ నేతలకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, జేడీయూ పై అధికారం చెలాయించేందుకు బీజేపీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని బిహార్ సి‌ఎం నితీశ్ కుమార్ కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వానికి దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఇటీవల ప్రధాని మోడీ అధ్యక్షతన నిర్వహించిన నీతి అయోగ్ సమావేశానికి కూడా నితిశ్ కుమార్ హాజరు కాలేదు. దాంతో బీజేపీ- జేడీయూ మద్య ఏదో జరుగుతోందనే అనుమానాలు అందరిలోనూ నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ ఎన్డీయే కూటమికి స్వస్తి పలికి తన ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. ఇది బీజేపీకి ఎవరు ఊహించని షాక్ అనే చెప్పవచ్చు. ఇక ఎన్డీయే నుంచి బయటకు వస్తే తాము మద్దతుగా నిలుస్తామని బిహార్ లో బలమైన పార్టీగా ఉన్న రాష్ట్రీయ జనతా దళ్ తో పాటు కాంగ్రెస్ కూడా జేడీయూ కు అండగా నిలిచాయి.

దీంతో నితీశ్ కుమార్ ఎన్డీయే కూటమికి వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఆర్ జెడి కి 79 సీట్లు ఉండగా, బీజేపీకి 77 సీట్లు ఉన్నాయి. ఇక జేడీయూ కు 45 సీట్లు ఉండగా, కాంగ్రెస్ కు 19 సీట్లు, వామపక్షాల కూటమికి 16 సీట్లు కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన జేడీయూ కు ఆర్ జెడి మరియు కాంగ్రెస్ అండగా నిలవడం వల్ల ఈ రెండు పార్టీలతో కూడిన ప్రభుత్వాన్ని నితీశ్ కుమార్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికి బీజేపీ కి అత్యంత బలమైన రాష్ట్రంగా ఉన్న బిహార్ లో ఈ విధంగా ఆన్యుహ్య పరిణామాలు చోటు చేసుకోవడం బీజేపీ దేశ రాజకీయాలపై తీవ్ర పరిణామం చూపే అవకాశం ఉంది.

Also Read

మోడీ ఫోకస్.. అతనిపైనే !

మన దేశం చుట్టూ.. సంక్షోభమే !

మోడీ తటస్థ వైఖరి.. వ్యూహంలో భాగమేనా ?

Related Articles

Most Populer

Recent Posts