Friday, April 26, 2024
- Advertisement -

ఎన్డీయేను వదిలించుకున్న తప్పని తలనొప్పి ..!

- Advertisement -

ప్రస్తుతం బిహార్ రాజకీయాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్ళు ఎన్డీయే కూటమికి మిత్రపక్షంగా ఉన్న జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఊహించని రీతిలో ఎన్డీయే కు గుడ్ బై చెప్పి .. బిహార్ లో తనకు ప్రత్యర్థి పార్టీగా ఉన్న ఆర్జేడితో చేతులు కలిపి కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు నితీశ్ కుమార్. అయితే ఎన్డీయే ను కాదని ప్రభుత్వాన్నైతే ఏర్పాటు చేశాడు గాని, తన పార్టీ నుంచే నితీశ్ కు అసమ్మతి సెగ తగులుతోంది. ఇటీవల మంత్రివర్గ విస్తరణకు జేడీయూకు చెందిన అయిదు మంది ఎమ్మేల్యేలు హాజరు కాలేదు. ప్రస్తుతం ఇదే జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

కొంతమంది జేడీయూ కు సంబంధించిన ఎమ్మెల్యేలకు ఆర్జేడి తో కలవడం ఇష్టం లేదనే వాదనలు ఆ మద్య బాగా వినిపించాయి. ఆ వార్తలను బలపరుస్తూ ఇప్పుడు ఐదుగురు ఎమ్మేల్యేలు మంత్రి వర్గ విస్తరణకు కాకపోవడంతో చర్చనీయాంశం అవుతోంది. ప్రస్తుతం నితీశ్ మంత్రివర్గం లో 31 మంది కొత్త మంత్రులుగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఆర్జేడి నుంచి 16 మంది, జేడీయూ నుంచి 11 మంది, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, ఒక స్వతంత్ర అభ్యర్థి, మంఝి పార్టీ నుంచి మరో అభ్యర్థికి మంత్రి వర్గంలో స్థానం కల్పించారు.

అయితే జేడీయూ నుంచి తక్కువ మందికి మంత్రి వర్గంలో స్థానం కల్పించడంతో నితిశ్ వైఖరి పట్ల కొంత మంది జేడీయూ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారట. మరి అసమ్మతిగా ఉన్న ఎమ్మేల్యేలు జేడీయూ కు రాజీనామా చేసి బీజేపీ గూటికి చేరిన ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ రాజీనామా చేస్తే నితీశ్ కుమార్ కు కొత్త తలనొప్పులు ఎదురయ్యే అవకాశం ఉంది. అసలే ప్రత్యర్ది పార్టీతో చేతులు కలిపిన నితీశ్ కు తన ఎమ్మేల్యేలు రాజీనామా చేస్తే మహారాష్ట్రలో ఉద్దవ్ థాక్రే కు పట్టిన గతే పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Also Read

జగన్ “అతిపెద్ద కుంభకోణం “.. తెరపైకి ?

షిండే లకు సీన్ సీతారే..?

మోడీని దువ్వుతున్న బాబు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -