Friday, May 3, 2024
- Advertisement -

బీజేపీకి సీన్​ రివర్స్​.. పార్టీ నుంచి ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలు ?

- Advertisement -

ఓ పార్టీ నుంచి గెలుపొందిన వ్యక్తి మరో పార్టీలో చేరడం నైతికంగా పతనం కావడమే. కానీ పార్టీ ఫిరాయింపుల చట్టం మనదేశంలో కచ్చితంగా అమలు కాదు. అందుకు కారణం స్పీకర్​కు సర్వాధికారాలు ఉండటమే. స్పీకర్​ అధికార పార్టీ కనుసన్నల్లో ఉంటారు కాబట్టి.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఆయన కఠిన చర్యలు తీసుకోలేరు. దీన్ని అడ్డం పెట్టుకొని పలు రాజకీయ పార్టీలు ఇతర పార్టీల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలను తమ పార్టీల్లోకి చేర్చుకుంటూ ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణలో 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్​ నుంచి గెలుపొంది టీఆర్​ఎస్​లో చేరారు. మంత్రులు కూడా అయ్యారు.

ఏపీలోనూ గతంలో ఇదే పరిస్థితి ఉండేది. దాదాపు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక బీజేపీ చాలా రాష్ట్రాల్లో ఇటువంటి గేమ్​ ప్లే చేసింది. ఏకంగా ప్రభుత్వాలనే కూల్చేసింది. కానీ ప్రస్తుతం బీజేపీకి ఈ ఫిరాయింపులు ఎదురు తన్నే పరిస్థితి కనిపిస్తున్నది. పశ్చిమబెంగాల్​లో బీజేపీ నుంచి గెలుపొందిన పలువురు ఎమ్మెల్యేలు అధికార టీఎంసీ వైపు చూస్తున్నారని సమాచారం.ఫిరాయింపుల గురించి, నైతిక విలువల గురించి బీజేపీ గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. అందుకు కారణం.. ఆ పార్టీ గతంలో వ్యవహరించిన తీరే.

ప్రస్తుతం బెంగాల్​లో బీజేపీ కీలక నేతగా ఉన్న ముకుల్​ రాయ్ .. టీఎంసీలో చేరారు. ఇదే దారిలో పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా టీఎంసీలో చేరబోతున్నారట. గతంలో టీఎంసీలో ఉండి బీజేపీలో చేరిన పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మమతా బెనర్జీ కూడా వారిని ఒక్కొక్కరిగా చేర్చుకుంటున్నారు. ఈ ఐదేళ్ల కాలంలో బీజేపీ నుంచి ఇంకా ఎంత మంది ఎమ్మెల్యేలు మమతా బెనర్జీ పార్టీలోకి వెళతారోనని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. బీజేపీ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గోడ దూక కుండా ఎలాంటి కట్టడి చర్యలు చేపడుతోందో వేచి చూడాలి.

Also Read

పంజాబ్​లో కొత్త పొత్తు..! బీజేపీకి నష్టం తప్పదా?

కర్ణాటకలో సీఎం మార్పు మళ్లీ తెరమీదకు .. క్లారిటీ ఇచ్చినా ఆగని ఊహాగానాలు

బెంగాల్​లో బీజేపీకి కోలుకోలేని దెబ్బ.. సొంత గూటికి ముకుల్..!

యూపీ సీఎం యోగిని మార్చేస్తారా? నిజమెంత?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -