Tuesday, May 21, 2024
- Advertisement -

బాబు, ప‌వ‌న్‌లు ఇద్ద‌రూ ఒక్క‌టేనా…?

- Advertisement -

కొత్త సంవ‌త్స‌రంలో ఏపీ రాజ‌కీయాలు మ‌రింత ర‌స‌వత్తరంగా మార‌నున్నాయి. త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌ధ్యంలో రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి కార‌ణం బాబు చేసిన వ్యాఖ్య‌లే. అస‌లు విష‌యానికి వ‌స్తే మాట‌లు మార్చ‌డంలో చంద్ర‌బాబును మించిన నేత‌లు దేశ చ‌రిత్ర‌లో ఎవ‌రూ లేరు. ఎన్నిక‌లు వ‌చ్చిన ప్ర‌తీసారి ఏదోక పార్టీతో పొత్తు పెట్టుకోనిదే ఎన్నిక‌ల‌కు వెల్ల‌రు.

2014 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌, భాజాపా మ‌ద్ద‌తుతో అధికారంలోకోచ్చింది టీడీపీ. ప‌వ‌న్ తో క‌లిసి ప‌నిచేస్తే జ‌గ‌న్‌కు బాధ ఎందుక‌ని బాబు చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిని రేపుతున్నాయి. బాబు ఎవ‌రితోనైనా పొత్తు పెట్టుకోవ‌చ్చు… కానీ ఇత‌ర పార్టీల వాళ్లు మాత్రం పొత్తు పెట్టుకుంటే ఆదేదో పాపంగా భావిస్తారు టీడీపీ అధినేత‌.

2014 ఎన్నిక‌ల్లో ప‌నిచేసిన టీడీపీ, జ‌న‌సేన‌లు బ‌ద్ద‌శ‌త్రువులఅయ్యారు.. ప్రత్యేక హోదా సహా పలు కీలక అంశాల్లో విభేదాలు తలెత్తడంతో బీజేపీ, టీడీపీలకు దూరం జరిగారు. రెండు పార్టీల తీరుపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని అధికార టీడీపీకి శత్రువుగా మారిపోయారు. మొద‌ట టీడీపీ ఆచితూచి స్పందించినా త‌ర్వాత విమ‌ర్శ‌ల ధాటిని పెంచింది. మ‌రో వైపు ఎన్నిక‌ల్లో ఓంటరిగా పోటీ చేస్తామ‌ని ప‌వ‌న్ అనేక సార్లు ప్ర‌క‌టించారు. అయితే ప‌వ‌న్‌పై బాబు చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిని రేపుతున్నాయి.

కేంద్రంతో టీడీపీ చేస్తున్న పోరాటంలో పవన్ కలిసి రావాలని ఆయన పిలుపునివ్వడం ఆసక్తిని రేపుతోంది. అంతేకాదు.. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఇబ్బందేమిటని ప్రశ్నించారు. పవన్ తమతో కలిసి రాకూడదనే ఉద్దేశ్యంతోనే జగన్ విమర్శలు చేస్తున్నారని చెప్పారు. అసలు జగన్ ఎటువైపు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

బాబు వ్యాఖ్య‌ల‌తో ఇరు పార్టీల మ‌ధ్య పొత్తు ఉంటుందా అనే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ లో పార్టీలను కూడగట్టడంలో బాబు కీలకంగా ఉన్నారు.ఏపీలో ప్రస్తుతం లెఫ్ట్ పార్టీలతో పవన్ కళ్యాణ్ కలిసి పనిచేస్తున్నారు. లెఫ్ట్ పార్టీలు కూడ బాబు కూటమిలో ఉంటామని స్పష్టం చేశాయి. మ‌రో వైపు వైసీపీ కూడా బాబు వ్యాఖ్య‌ల‌పై మండిప‌డుతున్నారు. టీడీపీకి జనసేన ఎప్పటికి మద్దతుగానే ఉంటుందని తాము చెబతున్నది వాస్తవమేనని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. జ‌గ‌న్‌, ప‌వ‌న్‌లు క‌లిస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకీ భ‌విష్య‌త్తు ఉండ‌ద‌నే వాస్త‌వాల‌ను గ్ర‌హించిన బాబు వ్యూహాత్మ‌కంగా ప‌వ‌న్‌కు గాలం వేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -