Thursday, May 16, 2024
- Advertisement -

తూర్పులో టీడీపీకి మరో ఎదురుదెబ్బ…పార్టీకి రాజీనామా చేసిన కీలకనేత

- Advertisement -

సార్వత్రికి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. బాబు మీద నమ్మకం లేకపోవడం పార్టీకి భవిష్యత్తు ఉండదనే కారణాలతో కీలక నాయకులు పార్టీని వీడుతున్నారు. మరో వైపు భాజాపా ఆపరేషన్ ఆకర్ష్ కు పార్టీ కుదేలవుతోంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో బాబుకు మరో బిగ్ షాక్ తగిలింది.

టీడీపీలో కీలక కాపునేత అయిన వరుపుల రాజా పార్టీ పదువులకు రాజీనామా చేశారు.ప్రత్తిపాడులో మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన రాజా చంద్రబాబు మీద అసంతృప్తితోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.పార్టీకి రాజీనామా చేసిన నేతల్లో ఎక్కువమంది కాపు సామాజికవర్గం నేతలే ఉండటం బాబును కలవరపెడుతోంది.

పార్టీకి రాజీనామా చేసిన తర్వాత రాజా బాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు.మొదటి నుండి కూడా చంద్రబాబు కాపులను చిన్న చూపు చూస్తున్నట్లు మండిపోయారు. రాష్ట్రంలోని పేదలకు ఏమి కావాలో తేల్చుకోలేని చంద్రబాబు సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు చేశారో అందరూ ఆలోచించాలని పిలుపివ్వటమే విచిత్రంగా ఉందని ఎద్దేవ చేశారు.

టీడీపీలో ఉన్న 80 శాతం కాపు నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, కాపులను చంద్రబాబు పట్టించుకోకుండా ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. కాపుల విషయంలో సీఎం వైఎస్‌ జగన్ మొదటి నుంచీ ఒకే విధానంతో ఉన్నారని అన్నారు.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు కితాబిచ్చారు. జగన్ పాలనను బ్రహ్మిండమని పొగడటం ద్వారా రాజకీయంగా తన భవిష్యత్ లో వైసీపీ చేరేందుకు సిద్దమయ్యారు. మూడు నెలల పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చి పక్షాళన చేశారని మెచ్చుకున్నారు. రాజధాని మారుస్తానని సీఎం జగన్ ఎక్కడా చెప్పలేదని, టీడీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. కొద్ది రోజుల తర్వాత కార్యకర్తలతో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -