ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేస్తున్న రైతు ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. ఆ మూడు కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు పలు రకాలుగా ఢిల్లీ సరిహద్దులో నిరసనలు తెలపుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రైతు సంఘాలు “చక్కాజామ్”ను నిర్వహించాయి.
అయితే, ఢిల్లీ సరిహద్దులో రైతు నిరసనలు తెలుపుతున్న రైతులకు మద్దతుగా తెలంగాణ, ఏపీల్లోనూ పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో చక్కాజామ్ కు మద్దతుగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు నిరసన కార్యక్రామాలు నిర్వహించాయి. హయత్ నగర్ జాతీయ రహదారిపై కాంగ్రెస్ సీపీఐ(ఎం), సీపీఎం, తెజస పార్టీల శ్రేణులు ఎండ్ల బండ్ల ప్రదర్శనలో పాల్గొని రైతులకు మద్దతు తెలిపాయి.
ఈ నిరసన కార్యక్రమాల్లో ఎండ్ల బండ్ల రోడ్డుపై చాలా దూరం వరకు వరుసగా వెలుతూ.. నిరసన తెలిపాయి. ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో ఈ బండ్ల ప్రదర్శనలో పాల్గొన్నారు. రైతులకు అనుకూలంగా గళమెత్తారు. అయితే, పెద్ద సంఖ్యలో నిరసన కారులు పాల్గొనడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు బలగాలను భారీగా మోహరించారు.
‘జైలు కొత్తకాదు.. హంతకుడన్న ముద్ర కొత్త కాదు’