Monday, May 20, 2024
- Advertisement -

రేవంత్ రెడ్డి రాజీనామాను ఆమోదిస్తారా…?

- Advertisement -

తెలంగాణా టీడీపీ నేత రేవంత్ రెడ్డి త‌న ఎమ్మెల్యే, పార్టీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌డం రెండు రాష్ట్రాల్లోను సంచ‌ల‌నంగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయించిన నేత‌లు ఎవ‌రు ఇప్ప‌టి వ‌ర‌కు రాజీనామ చేయ‌కుండా ప‌ద‌వులు అనుభ‌విస్తున్నారు. అయితె ఇప్పుడు రేవంత్ రాజీనామ‌లేఖ‌తో ఇద్ద‌రి రాష్ట్రాల చంద్రుళ్ల ప‌రిస్థి ముందు నుయ్యి…. వెనుక గొయ్యిలాగా త‌యార‌య్యింది.

ప‌దువుల‌కు రాజీనామ చేసి రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేర‌డంతో అన్ని పార్టీల్లోను చ‌ర్చ జ‌రుగుతోంది. అయితె ఆయ‌న రాజీన‌మాను ఆమోదిస్తారా లేదా అన్న చ‌ర్చ ఉత్కంఠ‌రేపుతోంది. రేవంత్ రాజీనామా ఆమోదిస్తే కొత్త చిక్కులు 2014 తర్వాత దాదాపు ముప్పై మంది ఎమ్మెల్యేల వరకు ఇతర పార్టీల నుంచి అధికార టీఆర్ఎస్‌లో చేరారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజీనామా ఆమోదిస్తే అధికార పార్టీకి కొత్త చిక్కులు తప్పకుండా వస్తాయని అంటున్నారు.

రేవంత్ రాజీనామా ఆమోదిస్తే.. రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే, దానిని స్పీకర్ ఆమోదిస్తే ఆయన మరోసారి కేసీఆర్ పైన పోరాటానికి సిద్ధమవుతారని అంటున్నారు. ఇక మిగిలిన వారి రాజీనామాల‌ను ఆమోదించాల‌ని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ లోప‌ల‌, బ‌య‌ట డిమాండ్ చేసె అవ‌కాశం ఉంది. దీంతో కేసీఆర్‌కు ఇబ్బందులు త‌ప్ప‌వు.

రేవంత్ రెడ్డి రాజీనామాను ఆమోదిస్తె ఏపీలో పార్టీ ఫిరాయించిన నేత‌ల రాజీనామాచేయాల‌ని డిమాండ్ చేసె అవ‌కాశం ఏర్ప‌డుతుంది. వైసీపీనుంచి పిరాయించిన నేత‌లు ఏకంగా మంత్రి ప‌దువులు అనుభ‌విస్తున్నారు. రేవంత్ రెడ్డి రాజీనామా ఆ మోదిస్తే ఏపీ ప్ర‌భుత్వంపై కూడా వైసీపీ ఒత్తిడి తీసుకురానుండ‌టంలో సందేహంలేదు. ఇద్ద‌రి చంద్రుళ్ల ప‌రిస్థితి ముందు నుయ్యి….వెనుక గొయ్యిలాగా త‌యార‌య్యింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -