Sunday, May 19, 2024
- Advertisement -

ఐటీ త‌రువాత టార్గెట్ ఎవ‌రంటే…?

- Advertisement -

ప్ర‌తిప‌క్ష పార్టీనేత‌ల‌పై ఐటీ దాడులు జ‌రిగితే సంబ‌ర‌ప‌డిన టీడీపీనేత‌ల‌కు అదే ఐటీ దాడులు నిద్ర‌లేకుండా చేస్తున్నాయి. కొన్ని రోజులుగా ఏపీలో ఐటీ దాడులు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఎందుకంటే దాడులు అధికార‌పార్టీ పెద్ద త‌ల‌యాక‌ల‌పైనే జ‌రుగుతుండ‌టంతో బాబు అండ్ కో గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్నారు. ఇత‌ర పార్టీల నేత‌ల‌పై ఐటీ దాడులు జ‌రిగితె అవి స‌క్ర‌మం..అదే వారిమీద జ‌రిగితే క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ని బీద అరుపులు అరుస్తున్నారు.

ఆదాయపు పన్నుశాఖ సోదాలు నిర్వహించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, ఐటీ సోదాలనేవి ‘ప్రాథమిక సమాచారం’ నేపథ్యంలోనే జరుగుతాయి. దాని వెనుకు రాజ‌కీయం ఉటుందంనేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. ఇప్పటికే టీడీపీ నేతలు బీద మస్తాన్‌రావు, సీఎం రమేష్‌లపై ఐటీదాడులు జరిగాయి. ఇకపైనా మ‌రిన్ని దాడులు జరగబోతున్నాయ‌నే వార్త‌ల నేప‌థ్యంలో టీడీపీ నేత‌ల గుండెల్లో రైల్లు ప‌రిగెడుతున్నాయి.

సీఎం రమేష్‌పై అధికార పార్టీ నేతలే గతంలో ఆరోపణలు చేశారు. బీద మస్తాన్‌రావు పరిస్థితీ ఇంతే. లిస్ట్‌లో ఇంకా చాలామంది వున్నారు. అందులో, ముఖ్యమంత్రి చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన మంత్రి నారాయణ వున్నారు. నారాయణ సంస్థల్లో జరుగుతున్నదేంటో అందరికీ తెల్సిందే.

అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న మాటేంటంటే ఒకవేళ ఆ దాడులు జరిగితే. ఆ తర్వాతి ఛాన్స్‌ మంత్రి గంటా శ్రీనివాసరావుదేనని టీడీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. టీడీపీ నేతలపై ఐటీసోదాలు జరిగితే, అక్కడికేదో ఆంధ్రప్రదేశ్‌ మీద దాడి.. అనేలా పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు తెలుగుదేశం పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందిగానీ.. ‘దాడులు జరగాల్సిందే.. నిజాలు నిగ్గు తేలాల్సిందే..’ అని రాష్ట్ర ప్రజలు భావిస్తున్న విషయాన్ని తెలుగు తమ్ముళ్ళు మర్చిపోతే ఎలా.

కేశినేని బస్సుల వ్యవహారం, సుజనా చౌదరి వ్యాపారాల్లో అక్రమాలు, చంద్రబాబు పుత్రరత్నం నారాలోకేష్‌ మీద వచ్చిన అభియోగాలు.. వీటిపై ఇటీవలి కాలంలో జరిగిన ‘రచ్చ’ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ నేపథ్యంలో, ముందు ముందు ఆంధ్రప్రదేశ్‌లో చాలా ఐటీ సోదాల్ని మనం చూడబోతున్నాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -