Monday, April 29, 2024
- Advertisement -

గంటా శ్రీనివాస్ రావు వైసీపీ లోకి లైన్ క్లియర్…

- Advertisement -

మొత్తానికి గంటా శ్రీనివాస్ రావు వైసీపీ లోకి రావడానికి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తుంది.. గత కొన్ని రోజులుగా ఏ పార్టీ కి వెళతాడు అని తెగ గుసగుసలు నడిచాయి.. కొన్ని రోజులు వైసీపీ లోకి గంటా వస్తాడని, లేదు బీజేపీ లోకి గంటా ఎంట్రీ అని చాలామంది చాలా ప్రచారాలు చేశారు.. కానీ గంటా చివరికి వైసీపీ లోకి రావడానికే మొగ్గు చూపారని అంటున్నారు.. నిజానికి మొదట గంటా వైసీపీ లోకి రావడానికి చూశారు కానీ విశాఖ లోని వైసీపీ నేతలు అయన రాకని చాలా వరకు ఆపే ప్రయత్నం చేశారు. ఎక్కడ తమ అస్తిత్వం కోల్పోతుందేమోనని గంటా రాకను విజయ్ సాయి రెడ్డి, అవంతి శ్రీనివాస్ లాంటి నేతలు ఆయనను వ్యతిరేకించారు..

అయితే జగన్ సుముఖంగానే ఉండడంతో వారు తగ్గక మనుకోలేదని తెలుస్తుంది. గంటా శ్రీనివాసరావు గత ఏడాదిగా తపస్సే చేస్తున్నారు. ఆయన ఎపుడైతే విపక్ష ఎమ్మెల్యే అయ్యారో నాడే టీడీపీకి స్వస్తివాచకం పలికేశారు. వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వడానికి నాటి నుంచే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. మొదట్లో విజయసాయిరెడ్డి ఒప్పుకున్నా జగన్ పచ్చ జెండా ఊపలేదు. ఆ తరువాత జగన్ సరేనంటే విజయసాయిరెడ్డి బిగపట్టికూర్చున్నాడు. దానికి కారణం సజ్జల రామక్రిష్ణారెడ్డి, తనకు చెప్పకుండా గంటాను ఆయన పార్టీలో చేర్పిస్తే చూస్తూ ఎలా ఊరుకుంటానని విజయసాయిరెడ్డి పట్టుదలకు పోయారు. అసలు గంటాయే వద్దు అంటూ జగన్ కి గట్టిగా చెప్పారు.

కానీ ఇప్పుడు గంటా ఏ క్షణాన అయినా వైసీపీ తీర్ధం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని ఆయన వర్గం నుంచి వినిపిస్తున్న మాట. అయితే అప్పుడు ఒప్పుకొని విజయ సాయి రెడ్డి ఇప్పుడు ఎందుకు ఒప్పుకున్నదంటే తాను మొదట్లో దూకుడుగా చేసిన తప్పుని తెలుసుకుని విజయసాయిరెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు గట్టిగా యత్నించారట. దాంతో నెల్లూరు పెద్దాయన పడిపోయారని వెల్ కం టు వైసీపీ అంటూ ఆయనే స్వయంగా ఆహ్వానించారని అంటున్నారు. తన కుమారుడు రవితేజను పార్టీలో చేర్పించి తాను అనధికార సభ్యుడిగా మారుతారని అంటున్నారు. మొత్తానికి గంటా శ్రీనివాసరావు మార్క్ రాజకీయంలో బకరా అయ్యేది మాత్రం మంత్రి అవంతి శ్రీనివాస్ అంటున్నారు.

రాజు గారిని దించడం కోసం జగన్ అలా నరుక్కోస్తున్నాడా..?

ఏపీకి స్పెషల్ స్టేటస్ రాబోతుంది..?

గంటా శ్రీనివాసరావు గురించి జగన్ మనసులో మాట..?

చంద్రబాబు మించిన జగన్ రాజకీయ ఎత్తుగడ..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -