అసెంబ్లీ ఎన్నికల ముందు జైలు నుంచి విడుదలయిన జయలలిత స్నేహితురాలు వీకే శశికళ.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. తన మద్దతుదారులతో మాట్లాడిన ఫోన్ సంభాషణలు ఆడియో వెలుగులోకి వచ్చాయి. అందరం కలిసి ఐకమత్యంలో పనిచేద్దామని తాను చెప్పిన మాటలను పెడచెవిన పెట్టడం వల్లే అన్నాడీఎంకే ఓటమిపాలైందని శశికళ చెబుతున్నట్టు ఆ ఆడియోలో ఉంది.
ఇదిలా ఉంటే వీకే శశికళపై మరో కేసు నమోదైంది. అన్నా డీఎంకే నేతను చంపేస్తానని బెదిరించాన్న ఫిర్యాదులు రాగా, పోలీసులు ఎఫ్ఐఆర్ ను రిజిస్టర్ చేశారు. అన్నాడీఎంకే నేత, న్యాయ శాఖ మాజీ మంత్రి సీవీ షణ్ముగం ఈ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు స్వీకరించిన విల్లుపురం జిల్లా పోలీసులు ఐపీసీలోని 506 (1), 507, 109, ఐటీ చట్టం 2000లోని 67 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు.
కాగా, అన్నాడీఎంకేపై కోల్పోయిన పట్టును తిరిగి సాధించే దిశగా శశికళ అడుగులు వేస్తున్నారు. ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోరంగా ఓటమి చెందగా, ఇప్పుడు పార్టీని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలను ప్రారంభించారు.
‘అఖండ’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి
బోరున విలపిస్తూ.. క్రీడా మైదానం నుంచి బయటకు వెళ్లిన సెరీనా విలియమ్స్!