Thursday, April 18, 2024
- Advertisement -

నల్లగొండలో దారుణం.. కరోనా టీకాకు బదులు రేబిస్ టీకా!

- Advertisement -

ఓ వైపు వైద్యులు.. వైద్య బృందాలు కరోనా సమయంలో ఎంతగొప్ప త్యాగాలు చేశారో.. చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కానీ కొన్ని చోట్ల నర్సులు చేస్తున్న నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తీసుకు వస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో ఓ నర్సు ఫోన్ మాట్లాడుతూ.. యువతికి రెండు సార్లు టీకా ఇచ్చి అసలు విషయం తెలుసుకొని అక్కడ నుంచి పరార్ అయ్యింది. ఆ యువతిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తాజాగా నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం బొల్లెపల్లిలో ఇలాంటి నిర్లక్ష్యమే మరోకటి చోటు చేసుకుంది.

కరోనా టీకా వేయించుకునేందుకు వెళ్లిన ఓ పారిశుద్ధ్య కార్మికురాలికి నర్సు రేబిస్ టీకా ఇవ్వడం కలకలం రేగింది. బొల్లెపల్లి ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పుట్ట ప్రమీల పాఠశాల హెచ్ఎం ఇచ్చిన లేఖ తీసుకుని కరోనా టీకా వేయించుకునేందుకు నిన్న ఉదయం 11 గంటలకు కట్టంగూరు పీహెచ్‌సీకి వెళ్లింది. ఇక్కడి పీహెచ్‌సీ భవనంలో సాధారణ టీకాలు ఇస్తుండగా, పక్కనే ఉన్న ఆయుష్ భవనంలో కొవిడ్ టీకాలు వేస్తున్నారు. ప్రమీళ టీకా వేయించుకోవడానికి పీహెచ్‌సీకి వెళ్లింది.

అక్కడ ఉన్న నర్సు అప్పటికే ఓ మహిళకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయగా, అదే సమయంలో వెళ్లిన ప్రమీలకు కూడా అదే సిరంజితో రేబిస్ టీకా ఇచ్చింది. అయితే ఈ నర్సు టీచర్ ఇచ్చిన లేఖ చూడకుండా నిర్లక్ష్యంగా తకుముందు ఉపయోగించిన సిరంజితోనే టీకా వేసిందని ప్రమీల ఆరోపించింది. అయితే ఒకే సిరంజితో ఇద్దరికి ఎలా వేస్తారని నిలదీయడంతో చిన్నగా అక్కడ నుంచి జారుకుంది నర్సు. బాధితురాలు కొవిడ్ టీకా బ్లాక్‌లోకి వెళ్లకుండా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇస్తున్న గదిలోకి వెళ్లడం వల్లే ఈ పొరపాటు జరిగిందని మండల వైద్యాధికారి తెలిపారు. అయితే ఆమెకు ఇచ్చింది టీటీ ఇంజక్షన్ అని పెద్ద ప్రమాదం ఏమీ లేదని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -