Wednesday, April 24, 2024
- Advertisement -

బోరున విలపిస్తూ.. క్రీడా మైదానం నుంచి బయటకు వెళ్లిన సెరీనా విలియమ్స్!

- Advertisement -

సెరీనా విలియమ్స్ ఈ పేరు చెబితే టెన్నిస్ క్రీడాభిమానులు మాత్రమే కాదు.. ప్రపంచంలో అన్ని క్రీడలు అభిమానించే వారు తెగ మెచ్చుకుంటారు. మైదానాంలోకి సెరీనా దిగిందంటే.. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి.. ఆమె ఆట తీరు అంత బలంగా.. వేగంగా ఉంటుంది. అందుకే ఏడుసార్లు వింబుల్డన్ టైటిల్ ని గెల్చుకుంది. అలాంటి సెరీనా విలియమ్స్ కన్నీరు పెట్టుకుంటూ క్రీడా మైదానం నుంచి బయటకు వెళ్లిన తీరు యావత్ ప్రపంచ క్రీడాభిమానులను కదిలించింది.

ఎనిమిదోసారి వింబుల్డన్ టైటిల్ ను గెలవాలన్న ఏకైక లక్ష్యంతో, తన చివరి గ్రాండ్ స్లామ్ ఆడేందుకు బరిలోకి దిగిన ఆమె, తొలి రౌండ్ నుంచి వైదొలగింది. ఆమె కన్న కలలు కల్లలయ్యాయి. బెలారస్ కు చెందిన అలెక్సాండ్రా సస్నోవిచ్‌ తో 39 సంవత్సరాల వయసులోనూ సత్తా చాటుతూ తొలి సెట్ లో 3-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో ఓ బలమైన షాక్ కొట్టబోయి కిందపడగా, ఎడమ మడమకు గాయమైంది.

డాక్టర్లు పరిశీలించిన అనంతరం ఆటను కొనసాగించిన ఆమె, మునుపటి స్థాయిలో రాణించలేక ఒక సెట్ ను కోల్పోయింది. ఆమె కాలు కదపలేని పరిస్థితికి వచ్చింది. ఇక ఆడలేనంటూ సెంటర్ కోర్టులో కన్నీటి పర్యంతమైంది. ఏడుస్తూనే మైదానాన్ని వీడింది. వింబుల్డన్ తొలి రౌండ్ లోనే సెరీనా నిష్క్రమించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సెరీనా సెంటర్ కోర్టు నుంచి బోరున విలపిస్తూ బయటకు నడవడం చూసి టెన్నిస్ ప్రపంచం ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -