Friday, May 17, 2024
- Advertisement -

కేసీఆర్‌ను ఆద‌ర్శంగా తీసుకోవాలి వైసీపీ…

- Advertisement -

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని వైసీపీ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అందుకే చివ‌రి అస్త్రంగా పాద‌యాత్ర చేస్తున్నారు. కొత్త పార్టీ పెట్ట‌క‌ముందు ఏపీ ముఖ్య‌మంత్రి కుమారిడిగా అంద‌రికీ తెలిసిందే. డప ఎంపి గా అందరికి తెలుసు.కడప ఎంపి గా పోటి చేసి దేశంలోనే అత్యధిక మెజారిటీతో సుమారు ఐదు లక్షల పైగా తేడా తో గెలిచి సంచలనం నెలకొల్పినాడు.

వైఎస్ మ‌ర‌నం త‌ర్వాత సోనియా గాంధీని ఎదురించి ప్ర‌త్యేక పార్టీ స్థాపించారు. రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు వైయస్ రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో జగన్ ను కూడా ఆదరించినారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు వైయస్ రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో జగన్ ను కూడా ఆదరించినారు. ఉప ఎన్నిక‌ల్లో అత్య‌ధిక సీట్లు క‌ట్ట‌బెట్టారు.

ఇక 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ చేసిన కొన్ని త‌ప్పుల వ‌ల్ల స్వ‌ల్ప ఆ పార్టీ కొంచెం లో అధికారాన్ని పోగొట్టుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జగన్ కు సిఎం అయ్యే అవకాశాన్ని కొట్టిపారేయ్ లేము. సీఎం అయ్యే అవ‌కాశం పుస్క‌లంగాఉన్న స‌మ‌స్య‌పై మాత్రం సీరియ‌స్‌గా దృష్టి సారించ‌డంలేదు.

రాష్ట్రం విడిపోయిన తరువాత ప్రత్యేక హోదా ఇస్తామన్న కేంద్రం మోసం చేసి ఆంధ్ర ప్రదేశ్ కు తీరని అన్యాయాన్ని చేసింది. అయితే దాన్ని సాధించడంలో టీడిపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కేంద్రాన్ని నిలదీయాల్సిన ప్రభుత్వం మరి దేనికి భయపడి, కేంద్రాన్ని గట్టిగా అడగడం లేదో అర్ధం కావడం లేదు. ప్రతిపక్షం వారేమో చంద్ర బాబు నాయుడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయ్యి ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్ ను తాకట్టు పెట్టాడని విమర్శలు చేస్తున్నారు.
ఎవ‌రు ఎన్ని విమ‌ర్శ‌లు చేస‌కున్నా టీడిపి మాత్రం ప్రత్యేక హోదా సాధించడం లో విఫలమైందని చెప్పవచ్చు. ఇది జ‌గ‌న్‌కు ఒక సువ‌ర్న అవ‌కాశం. దీనిని ఒక ఉద్యమం లా నడిపి ప్రజలందరినీ మమేకం చేయగలిగితే ప్రతిపక్ష పార్టీ కి మంచి పేరు వస్తుంది. అయితే జగన్ ఎందుకు ఆ పని చేయడం లేదని అందరి ప్రశ్న. అయితే జగన్ కు ఉన్న కేసుల భయం వల్లనే అని కొందరు అభిప్రాయ పడుతున్నారు.

కేసీఆర్‌ను ఉదాహ‌ర‌న‌గా తీసుకుంటే ప్ర‌త్యేక తెలంగాణా ఉద్య‌మంచేసి చివ‌ర‌కు ప్ర‌త్యేక తెలంగాణ‌ను సాధించి తెలంగాణ తో పాటు అధికారాన్ని కూడా చేజిక్కిచ్చుకున్నాడు. మ‌రి కేసీఆర్‌ను ఆద‌ర్శంగా తీసుకోవాలి వైసీపీ. ప్ర‌త్యేక‌హోదాను ఒక ఉద్య‌మంలా ప్ర‌జ‌లంద‌రినీ క‌లుపుకొని పోతే టీడీపీ ఇబ్బందుల్లో ప‌డ‌టం ఖాయం. ఎన్ని దీక్ష‌లు చేసినా ఫ‌లితాలు అంతంత‌మాత్ర‌మే కాబ‌ట్టి ఇప్ప‌టికైనా జ‌గ‌న్ క‌ల్లుతెర‌వాల‌ని అంద‌రూ కోరుకుంటున్నారు. ఇదే జ‌రిగితే జ‌గ‌న్ సీఎం అవ‌డం త‌థ్యం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -