Friday, May 17, 2024
- Advertisement -

నంద్యాల‌లో భాజాపాకు ప‌దివేల ఓట్ల వ‌ర‌కు ఉన్నాయి….

- Advertisement -

నంద్యాలలో తెలుగుదేశంపార్టీ నేతల పరిస్ధితి విచిత్రంగా ఉంది. ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి నానాతంటాలు ప‌డుతున్నారు.చంద్ర‌బాబు నియేజ‌క‌వ‌ర్గంలో రెండు సార్లు ప‌ర్య‌టించారు.ల్లాలో నేతలు కాకుండా పదిమంది మంత్రులు 25 మంది ఎంఎల్ఏలు, ఐదుగురు ఎంఎల్సీలు ప్రచారం చేస్తున్నారు. దీన్ని బట్టే టిడిపి పరిస్ధితి ఏంటనేది ఎవరైనా అర్ధం చేసుకోవచ్చు.

టీడీపీ మిత్ర‌ప‌క్షం భాజాపాను మాత్రం సాయం చేయ‌మ‌ని అడిగితే నామోషిగా పీల‌వుతున్న‌ట్లుంది బాబుగారికి. దుకంటే, దాదాపు నెలరోజులుగా నియోజకవర్గంలో టిడిపి ప్రచారం మొదలుపెట్టినా ఇప్పటి వరకూ భాజపాను మాత్రం ప్రచారానికి రమ్మని ఒక్కు కూడా పిల‌వలేదు. పిలిచినా భాజపా కండువా లేకుండా ప్రచారంలోకి రావాలని షరతు విధించారు.

మిత్రపక్ష హోదాలో తమ పార్టీ కండువా కప్పుకుని ప్రచారంలోకి వస్తే ఏమవుతుందన్న భాజపా నేతల ప్రశ్నకు టిడిపి నేతల వద్ద సమాధానం లేదు. పైగా ‘అవసరమనుకుంటే ప్రచారానికి రమ్మం’టూ టిడిపి నేతలు కబురు చేసారు. దాంతో భాజపా నేతలకు ఒళ్ళుమండి అసలు ప్రచారానికే దూరంగా ఉన్నారు.

ఎంత తక్కువగా చూసినా నంద్యాల నియోజకవర్గంలో భాజపాకు సుమారు 10 వేల ఓట్లున్నాయి. ప్రస్తుత పరిస్ధితిలో 10 వేల ఓట్లు అంటే చిన్న సంఖ్యేమీకాదు. వంద ఓట్లు, 200 ఓట్లున్నాయనుకున్న వాళ్ళని కూడా స్వయంగా చంద్రబాబే బ్రతిమలాడుకుంటన్నారు గట్టిగా పనిచేయమని. అటువంటిది మిత్రపక్షాన్ని ఎందుకు పట్టించుకోవటం లేదో ఎవరికీ అర్ధం కావటం లేదు. వేడినీల్ల‌కు కాస్త చ‌న్నీల్లు తోడ‌యిన‌ట్లు….టీడీపీ విజ‌యంలో భాజాపాకు ఉన్న ఓట్లు కీల‌కం కావ‌చ్చు.ఎప్పుడు ఏం జ‌రుగుతాదో చెప్ప‌లేం.త‌క్కువ ఓట్ల‌తో ఓడిపోతె అప్పుడు తెలుస్తుంది విలువ‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -