Thursday, May 16, 2024
- Advertisement -

ఏపీ రాజ‌కీయాల్లో కొత్త స‌మీక‌ర‌ణాలు…. బాబులో మొద‌ల‌యిన ఆందోళ‌న‌..

- Advertisement -

ప్ర‌త్యేక హోదా ఇస్తే భాజాపాతో క‌ల‌సి ప‌నిచేసేందుకు సిద్ద‌మేన‌ని ఒ జాతీయ న్యూస్ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వూలో జ‌గ‌న్ క్లారిటీగా చెప్పారు. దీంతో ఏపీ రాజ‌కీయాల్లో కొత్త స‌మీక‌ర‌ణాలు చోటు చేసుకోనున్నాయి. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. త్వ‌ర‌లోనే మోదీ, జ‌గ‌న్ భేటీ అవుతున్నార‌నే వార్త‌లు సంచ‌ల‌నంగా మారాయి.

వీరి భేటీకీ ఢిల్లీలో జగన్ తరపున కీలకంగా వ్యవహరిస్తున్న ఓ ఎంపి ప్రధాని అపాయిట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారట. అవకాశం దొరికితే పాదయాత్ర మధ్యలోనే మోడిని జగన్ కలిసే అవకాశాలున్నాయి. ఎప్పుడైతే ప్రధాని అపాయిట్మెంట్ కోసం ఓ ఎంపి ప్రయత్నిస్తున్నారని తెలిసిందో టిడిపి నేతల్లో ఆందోళన మొదలైంది. అవకాశం దొరికితే పాదయాత్ర మధ్యలోనే మోడిని జగన్ కలిసే అవకాశాలున్నాయి.

పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌రుగుచున్నాయికాబ‌ట్టి ప్ర‌ధాని అంద‌రికీ అందుబాటులోనే ఉంటారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మోడి-జగన్ భేటీకి రంగం సిద్ధం చేయాలని సదరు ఎంపి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. భాజాపా-టీడీపీ మ‌ధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. వచ్చే ఎన్నికల్లో ఒంటిరి పోటీకి భాజపాలోని కొందరు నేతలు గట్టిగ పట్టుబడుతున్నారు.

మ‌రో వైపు ఏపీ అభివృద్దికి కేంద్రం స‌హ‌క‌రించ‌డంలేద‌న్న‌ది తెలిసిందే. దీంతో దాంతో మూడున్నరేళ్ళ పాలపై జనాల్లో వ్యతిరేకత మొదలైపోయింది. మ‌రోసారి ఎన్నిక‌ల‌కు వెల్తే ప్ర‌జ‌ల‌నుంచి పూర్తి వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌నే ఆందోళ‌న బాబులో మొద‌ల‌య్యింది. దీంతో భాజాపాను వ‌దిలించుకొనేందుకు అవ‌కాశం కోసం బాబు ఎదురు చూస్తున్నారు.

మ‌రో వైపు భాజపాలోని కొందరు నేతలు వచ్చే ఎన్నికల్లో వైసిపితో పొత్తు విషయంలో సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే జగన్ పాదయాత్రను భాజపా వర్గాలు చాలా నిశితంగా పరిశీలిస్తున్నాయ్. అదే సమయంలో కేంద్రనిఘా అధికారులు కూడా రోజువారీ నివేదికలను కేంద్రానికి అందిస్తున్నారు.

మూడున్నరేళ్ళ పాలనలో సంక్షేమ పధకాల అమలు, ఇరిగేషన్ పథకాల నిర్మాణం తదతరాల విషయంలో చంద్రబాబుపై విపరీతమైన అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ విషయాలను కూడా భాజపాలోని ఒక వర్గం ఎప్పటికప్పుడు తమ కేంద్ర నాయకత్వానికి అందిస్తున్నాయట. ప‌రిణామాలు చూస్తుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో భాజాపా, వైసీపీ పొత్తుపై ఆశలు చిగురిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -