Monday, May 20, 2024
- Advertisement -

ప్ర‌శాంతంగా తెలంగాణ శాస‌న‌స‌భ స‌మావేశాలు

- Advertisement -
  • అంద‌రికీ మాట్లాడే అవ‌కాశం
  • ఏపీలో అలాంటి ప‌రిస్థితి ఎక్క‌డా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తెలంగాణను చూసి నేర్చుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. తెలంగాణ రాష్ట్ర శాస‌న స‌భ స‌మావేశాలు ముగిశాయి. 16 రోజుల పాటు నిరాటంకంగా సాగిన‌ స‌మావేశాలు ప్ర‌శాంతంగా జ‌రిగాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంతో పోలిస్తే ఈ స‌మావేశాలు స‌జావుగా.. ప‌ద్ధ‌తిగా జ‌రిగాయి. అంద‌రికీ మాట్లాడే అవ‌కాశం క‌ల్పిస్తూ స‌భా నియమాల‌కు అనుగుణంగా సాగుతోంది. కొత్త ప‌ద్ధ‌తితో స‌భ కార్య‌క్ర‌మాలు న‌డుస్తూ అంద‌రినీ స‌మావేశాలు ఆక‌ట్టుకున్నాయి. స్వ‌ల్ప వాగ్వాదాలు, అర్థ‌వంత‌మైన చ‌ర్చ‌ల‌తో స‌భ‌కు నిండు రూపం సంత‌రించుకుంది. అలాంటి ప‌రిస్థితి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టంలో ఏనాడూ క‌న‌ప‌డ‌లేదు.

మూడేళ్ల‌ల్లో నిర్వ‌హించిన స‌మావేశాల‌న్నీ అధ్వానంగా జ‌రిగాయి. ఒక అర్థ‌వంత‌మైన చ‌ర్చ ఏనాడూ జ‌ర‌గ‌లేదు. వాదోప‌వాదాలు, కొట్లాట‌లు చోటుచేసుకున్నాయి. స‌భ్యులు ఏరా.. ఏంట్రా అని అనుకునే స్థాయికి చేరాయి. దీంతో శాస‌న స‌భ స‌మావేశాల‌పై ప్ర‌జ‌ల‌కు ఈస‌డింపు క‌లిగించాయి. తెలంగాణ స‌మావేశాలు 16 రోజులు 69.25 గంట‌లు నిరాటంకంగా జ‌రిగాయి. స‌భ్యులంద‌రికీ మాట్లాడానికి అవ‌కాశం దొరికింది. కొత్త స‌భ్యుల‌కు కూడా అవ‌కాశం క‌ల్పించారు. విప‌క్షాలంద‌రికీ మాట్లాడే అవ‌కాశం క‌ల్పించారు. కాంగ్రెస్, తెలుగుదేశం, ఎంఐఎం, బీజేపీ, చివ‌రికి సీపీఎం, సీపీఐ పార్టీ ఎమ్మెల్యేలంద‌రికీ అవ‌కాశం క‌ల్పించారు. ఉన్న 119 మంది ఎమ్మెల్యేలంద‌రికీ మాట్లాడేందుకు అవ‌కాశం క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నించారు. స్వ‌యంగా ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు ప్ర‌తిప‌క్షం అడిగిన‌న్ని రోజులు స‌మావేశాలు నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో స‌భా కార్య‌క్ర‌మాలు శాంతంగా జ‌రిగాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉన్న ఒకే ఒక్క ప్ర‌తిప‌క్షానికి కూడా అధికార పార్టీ మాట్లాడ‌డానికి అవ‌కాశం క‌ల్పించ‌డం లేదు. రోజు వాదోప‌వాదాలు, గొడ‌వ‌లు జ‌రిగి ఎప్పుడూ వాయిదాల ప‌ర్వం కొన‌సాగాయి. ఈ మూడేన్న‌రేళ్ల‌లో జ‌రిగిన స‌మావేశాల‌న్నీ అదే విధంగా జ‌రిగాయి. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ఏనాడూ స‌క్ర‌మంగా మాట్లాడ‌డానికి అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఎప్పుడూ మైక్ క‌ట్ చేస్తూ అప్ర‌జాస్వామికంగా ప్ర‌వ‌ర్తించారు. చివ‌రికి ఫైర్‌బ్రాండ్‌, న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్‌కే రోజాను అయితే ఏడాది పాటు స‌భ నుంచి స‌స్పెండ్ చేశారు.

ఈ విధంగా శాస‌న‌స‌భ స‌మావేశాలు ర‌చ్చ‌ర‌చ్చ‌గా జ‌రిగాయి. అలాంటి స‌మావేశాల‌ను చూసిన వైఎస్సార్‌సీపీ ప్ర‌స్తుతం జ‌ర‌గాల్సిన స‌మావేశాల‌ను పూర్తిగా బ‌హిష్క‌రించింది. ఇప్పుడు స‌మావేశాల్లో ఒకే ఒక అధికార పార్టీ మాత్ర‌మే పాల్గొంటోంది. ప్ర్రశ్న‌లు వారే వేసుకోవాలి.. వారికి వారే స‌మాధానాలు చెప్పుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -